Jiah Khan case: సూరజ్ పంచోలీ నిర్దోషి.. నటి జియాఖాన్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు
ముంబై: 2013 జూన్‌లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. నటుడు సూరజ్ పంచోలీ దోషిగా నిరూపించే సాక్ష్యాలు లభ్యం కాకపోవడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.
అంతకుముందు సూరజ్ తన ఇంటినుంచి కోర్టుకు బయలుదేరుతున్న సమయంలో మీడియాతో మాట్లాడలేదు. చాలా ముభావంగా కనిపించారు.తల్లి జరీనా వహాబ్‌తో సూరజ్ కోర్టుకు బయలుదేరి వెళ్లాడు. సూరజ్ పంచోలీ కడిగిన ముత్యంలా బయపడతారని అతని కుటుంబ సభ్యులు చెప్పారు.
2013 జూన్ 3వ తేదీన బాలీవుడ్ నటి జియాఖాన్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. అయితే తాను రాసిన లేఖ ఆధారంగా జియా ఖాన్ ఆత్మహత్యకు సూరజ్ పంచోలీ కారణమని పేర్కొంటూ సెక్షన్ 306 కింద అరెస్టు చేయడం జరిగింది. జియా ఖాన్ రాసినట్లుగా చెబుతున్న లేఖను పోలీసులు జూన్ 10వ తేదీన స్వాధీనం చేసుకున్నారు.

నటులు ఆదిత్య పంచోలీ జరీనా వహాబ్‌ల కుమారుడైన సూరజ్ పంచోలీ మృతురాలు జియాఖాన్‌తో సంబంధం నెరిపేవాడు.జియాఖాన్ మృతికి కారణం ప్రియుడు సూరజ్ పంచోలీ అని జియా తల్లి రబియా ఖాన్ ఆరోపించారు. 2013 అక్టోబరులో సీబీఐ విచారణ కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.అంతేకాదు తన కూతురిది ఆత్మహత్యకాదని హత్యని ఆమె ఆరోపించారు.
బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 2014లో మహారాష్ట్ర పోలీసుల నుంచి కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. తన కూతురు జియా ఖాన్ సూరజ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండేదని చెప్పింది. 2012 నుంచే సూరజ్ జియాఖాన్‌లు డేటింగ్‌లో ఉండేవారని చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications