పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ముమైత్ ఖాన్... క్యాబ్ డ్రైవర్ ఆరోపణలపై ఇదీ ఆమె రియాక్షన్...
సినీ నటి ముమైత్ ఖాన్‌పై ఇటీవల ఓ క్యాబ్ డ్రైవర్ చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ముమైత్ ఆ ఆరోపణలను ఖండించారు. క్యాబ్ డ్రైవర్‌ను చీట్ చేయాల్సిన అవసరం తనకు లేదని... తనపై అతను తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశానని... మీడియా కేవలం అతని వెర్షన్‌తో వన్ సైడ్ వార్తలు రాయడం బాధించిందన్నారు. గురువారం(అక్టోబర్ 1) ముమైత్ హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు చేశారు.

ముమైత్ ఏమన్నారు...
పంజాగుట్ట పోలీసులకు క్యాబ్ డ్రైవర్ రాజుపై ఫిర్యాదు అనంతరం ముమైత్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. 'క్యాబ్ డ్రైవర్ నాపై చేసిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాను. నాకు క్యాబ్ డ్రైవర్‌ను చీట్ చేయాల్సిన అవసరం ఏంటి.. కొన్ని మీడియా ఛానళ్లు నా పరువుకి భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేసే అధికారం ఏంటి... ఒక్కసారి ఆలోచించండి. క్యాబ్ డ్రైవర్ నాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. అతను చెప్పినదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అతను రాష్ డ్రైవింగ్ చేసి నన్ను భయాందోళనకు గురి చేశాడు. అతనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాను.' అని ముమైత్ చెప్పారు.

నేనెలాంటిదాన్నో అందరికీ తెలుసు...
'క్యాబ్ డ్రైవర్‌కు ఇవ్వాల్సిన రూ.23,500 అప్పుడే ఇచ్చేశాను. ఆ ఆధారాలు కూడా పోలీసులకు అందజేశాను. మీడియా ఒక్క సైడ్ వర్షన్ తీసుకొని వార్తలు ప్రసారం చేయడం నన్ను బాధించింది. నేను 12 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఏంటో,ఎలాంటిదాన్నో అందరికీ తెలుసు. టోల్‌గేట్ చార్జీలు కూడా ఇవ్వలేదని క్యాబ్ డ్రైవర్ చెప్పడం అబద్దం. ఆ డబ్బులు నేనే చెల్లించాను.' అని ముమైత్‌ఖాన్ తెలిపారు.

క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు...
ముమైత్ ఖాన్‌పై హైదరాబాద్‌కి చెందిన రాజు అనే ఓ క్యాబ్ డ్రైవర్ ఇటీవల చీటింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల గోవా ట్రిప్ కోసం తన క్యాబ్ బుక్ చేసుకున్న ముమైత్... మరో ఐదు రోజులు అదనంగా క్యాబ్‌ను వాడుకుందని ఆరోపించాడు. అందుకు గాను డబ్బులు కూడా చెల్లించలేదని... కనీసం టోల్ చార్జీలు, తిండి ఖర్చులు,అకామడేషన్ డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. ముమైత్ నుంచి ఇంకా రూ.15వేలు రావాల్సి ఉందని.. తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ముమైత్‌తో దిగిన ఫోటోలు,టోల్ చార్జీల రిసిప్ట్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌లో చర్చించాక ముమైత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.
Recommended Video

సోషల్ మీడియాలో విమర్శలు..
ముమైత్ తనకు డబ్బులు ఇవ్వకుండా చీట్ చేసిందని క్యాబ్ డ్రైవర్ ఆరోపించడంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఓ సినీ నటి అయి ఉండి క్యాబ్ డ్రైవర్‌కు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టడమేంటని చాలామంది ప్రశ్నించారు. గత రెండు రోజులుగా ముమైత్‌పై అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్‌చల్ చేయడంతో ఎట్టకేలకు ఆమె స్పందించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని చెబుతూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications