Actress: అమ్మతోడు... ప్రెస్ మీట్ లో మేడమ్ ఆ ఒక్కమాట మాట్లాడితే ఒట్టు, చెప్పిందే, ఎస్కేప్ !
బెంగళూరు: డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలుపాలై బెయిల్ మీద బయటకు వచ్చిన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్, హనీ రాగిణి ద్వివేది ఫస్ట్ టైమ్ మీడియాకు ముందుకు వచ్చారు. డ్రగ్స్ కేసు గురించి మేడమ్ ఏం చెబుతుందో అంటూ ఎగరేసుకుంటూ వెళ్లిన మీడియాకు రాగిణి కూల్ గా సమాధానం చెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం సమాధానం చెప్పకుండా ఆమె చెప్పిన మాటలతో అందరూ షాక్ అయ్యారు. 2020 సంవత్సరంలోని అన్ని రోజులు తనకు మాత్రమే కాదు, అందరికి చెడ్డరోజులని, అవి చాలా బ్యాడ్ డేస్ అని అన్నారు. తనకు ఇక ముందు మంచి రోజులు వస్తాయని, సోమవారం మళ్లీ ప్రెస్ మీట్ పెడుతానని, ఆ రోజు అన్ని విషయాలు చెబుతానని,, ఈ రోజు నేను చెప్పింది మీరు వినాలి అంటూ రాగిణి మేడమ్ దచ్చికొట్టారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒక్కమాటకూడా మాట్లాడకుండా రాగిణి ఎస్కేప్ అయ్యారు.

ప్రెస్ క్లబ్ కిటకిటా
శుక్రవారం బెంగళూరులోని ప్రెస్ క్లబ్ లో రాగిణి ద్వివేది మీడియాతో మాట్లాడుతారని మీడియాకు ముందుగానే సమాచారం అందింది. డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన రాగిణి మొదటిసారి మీడియాకు ముందుకు వస్తుండటంతో ఆమె డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏమి చెబుతారో అంటూ అందరికి ఆసక్తి పెరిగిపోయింది. శుక్రవారం బెంగళూరులోని ప్రెస్ క్లబ్ లో మీడియా మిత్రులతో పాటు రాగిణి అభిమానులతో కిటకిటలాడిపోయింది.

వచ్చిన పని చూసుకుంటాను
ఓ క్రికెట్ టోర్నీకి రాగిణి ద్వివేది బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ క్రికెట్ టోర్నీకి సంబంధించిన వివరాలు వెళ్లడించడానికి రాగిణి బెంగళూరు ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. జైలు నుంచి విడుదలైన గంటల్లోనే తాను జైలుకు వెళ్లడానికి కారణం అయిన వారి వివరాలు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెబుతానని ఆరోజు రాగిణి చాలెంజ్ చేశారు. అయితే ఈ రోజు మాత్రం తాను వచ్చిన పని చూసుకుని వెలుతానని రాగిణి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

అందరికీ బ్యాడ్ టైమ్
డ్రగ్స్ కేసు గురించి మేడమ్ ఏం చెబుతుందో అంటూ ఎగరేసుకుంటూ వెళ్లిన మీడియాకు రాగిణి కూల్ గా సమాధానం చెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నలకు రాగిణి ఏ మాత్రం సమాధానం చెప్పలేదు. హీరోయిన్ రాగిణి చెప్పిన మాటలతో అందరూ షాక్ అయ్యారు. 2020 సంవత్సరంలోని అన్ని రోజులు తనకు మాత్రమే కాదు, అందరికి చెడ్డరోజులని, అవి చాలా బ్యాడ్ డేస్ అని మేడమ్ రాగిణి ద్వివేది అన్నారు.

సోమవారం మాట్లాడుతా
తనకు ఇక ముందు మంచి రోజులు వస్తాయని, సోమవారం మళ్లీ ప్రెస్ మీట్ పెడుతానని, ఆ రోజు అన్ని విషయాలు చెబుతానని, ఈ రోజు నేను చెప్పింది మీరు వినాలి అని రాగిణి అన్నారు. తనకు గత ఏడాది చేదుఅనుభవం ఎదురైయ్యిందని, 2021లో తనకు మంచి రోజులు వస్తాయని, నా జీవితం పాజిటివ్ గా సాగిపోతుందని నటి రాగిణి ద్వివేది ధీమా వ్యక్తం చేశారు.

నాకు సంబంధం లేదు.... ఇక సినిమాలే దిక్కు
డ్రగ్స్ కేసుకు సంబంధించి తాను ఏ ఒక్క విషయం కూడా మాట్లాడనని రాగిణి ద్వివేది తేల్చి చెప్పారు. డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని రాగిణి అన్నారు. కర్వ -3 సినిమాతో తాను మళ్లీ బిజీ అవుతానని రాగిణి చెప్పారు. బెంగళూరు కాటన్ పేట్ డ్రగ్స్ కేసులో 2020 సెప్టెంబర్ 4వ తేదీ అరెస్టు అయిన రాగిణి ద్వివేది జనవరి 145 రోజులకు పైగా బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జీవితం గడిపింది.

ఒక్కమాట మాట్లాడితే ఒట్టు
జనవరి 21వ తేదీ సుప్రీం కోర్టులో రాగిణి బెయిల్ మంజూరు అయినా వివిద కారణాలతో ఆమె జనవరి 25వ తేదీ సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యింది. ఆ రోజు నుంచి మీడియా ముందుకు రాకుండా ఇంట్లోనే గడిపిన రాగిణి మొదటి సారి మీడియాకు ముందుకు వచ్చినా డ్రగ్స్ కేసు గురించి ఏ ఒక్కమాటకూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఎస్కేప్ అయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications