చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత మృతికి అదే కారణమా?: బాంబు పేల్చిన అంక్యుపంక్చర్ డాక్టర్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

జయలలిత మరణం పై తాజాగా మరో ఆసక్తికర విషయం : స్టెరాయిడ్లు ఇచ్చినట్లు టాక్ !

చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణించి ఏడాది పూర్తయినా.. ఇంకా ఆమె మరణంపై చర్చ సద్దుమణగలేదు. జయ మృతిపై ఆమె అభిమానులకు, ఆప్తులకు ఇప్పటికీ ఎన్నో అనుమానాలు.

చివరి రోజుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినవాళ్లు అతకొద్ది మాత్రమే. నాటకీయ పరిణామాల నడుమ అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన జయలలిత మరణానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఓవర్ డోస్:

ఓవర్ డోస్:

అపోలో ఆసుపత్రికి తరలించడం కన్నా ముందు జయలలితకు ఇంట్లోనే చికిత్స అందించారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జయలలితకు మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చినట్లు ఆక్యుపంక్చర్‌ వైద్య నిపుణుడు శంకర్‌ బాంబు పేల్చారు.

 శంకర్ సాక్ష్యం:

శంకర్ సాక్ష్యం:

ఆక్యుపంక్చర్‌ వైద్య నిపుణుడైన శంకర్‌.. గతంలో జయలలితకు కూడా చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో.. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆరుముగన్‌(మద్రాసు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి) కమిటీ మంగళవారం ఆయన సాక్ష్యాన్ని నమోదు చేసింది.

శంకర్ ఏం అన్నారు:

శంకర్ ఏం అన్నారు:

'గత ఏడాది సెప్టెంబర్‌ 22వ తేదీ రాత్రి జయలలిత అస్వస్థతకు గురైన వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. ఇదే సందర్భంగా ఆమెకు మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చినట్లు గుర్తించాం' అని శంకర్ తెలిపారు.

సంచలనం: జయలలిత తండ్రిని చంపింది ఆమె తల్లే?, వెలుగులోకి మరో కథనం..సంచలనం: జయలలిత తండ్రిని చంపింది ఆమె తల్లే?, వెలుగులోకి మరో కథనం..

 సన్నిహితులను ఆరా:

సన్నిహితులను ఆరా:

జయలలితతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన మాజీ అధికారులను కూడా జస్టిస్ మురుగన్ విచారించనున్నారు. ఈ నేపథ్యంలో.. జయలలిత సన్నిహితురాలు, మాజీ సీఎస్ ఈనెల 20న విచారణ సంఘం ఎదుట హాజరుకానున్నారు. ఇక 21న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు కూడా విచారణకు హాజరుకానున్నారు.

English summary
Shankar, An acupuncture doctor said over dosage of steroids leads to jayalalithaa death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X