IRCTC కొంప కొల్లేరే ఇక: రైలు టికెట్ల అమ్మకాల్లో అదాని ఎంట్రీ

ముంబై: రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి మొట్టమొదటగా గుర్తుకొచ్చేది.. ఐఆర్‌సీటీసీ. క్షణాల్లో టికెట్లను బుక్ చేసుకోవడానికి మెజారిటీ ప్రయాణికులు దీని మీదే ఆధారపడతారు. వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ప్రతి సంవత్సరం సగటున 14 లక్షల వరకు టికెట్లను అమ్ముతుంటుంది ఐఆర్‌సీటీసీ. ఒక రోజులో గరిష్ఠంగా 50,000 టికెట్లను విక్రయించిన చరిత్ర దీనికి ఉంది.

అలాంటి ఐఆర్‌సీటీసీ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. దీనికి కారణాలు అనేకం. ప్రత్యామ్నాయ వనరులు అనేకం అందుబాటులోకి రావడం, అవన్నీ కూడా ప్రయాణికులకు ఆఫర్లను ఇస్తోండటం వల్ల ఐఆర్‌సీటీసీ కార్యకలాపాలు కొంత మందగించాయి. గో ఐబిబో, పేటీఎం, రెడ్ బస్, ట్రైన్‌మెన్, రెడ్ రైల్, ఇక్సిగో, మేక్ మై ట్రిప్.. వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది ఐఆర్‌సీటీసీ.

Adani

ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఈ పోటీ మరింత తీవ్రతరమైంది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టబోతోన్నాయి. రైల్వే టికెట్ల అమ్మకాల వ్యాపారాన్ని త్వరలో ఆరంభించబోతోన్నాయి. అదాని డిజిటల్ ల్యాబ్స్ పేరుతో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని అదాని గ్రూప్స్ ఏర్పాటు చేశాయి. త్వరలోనే ఇది తన కార్యకలాపాలను మొదలుపెట్టబోతోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ట్రైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లల్లో ఒకటైన ట్రైన్‌మెన్‌ను అదాని ఎంటర్‌ప్రైజెస్ టేకోవర్ చేయనుంది. అందులో వందశాతం పెట్టుబడులను పెట్టనుంది. ట్రైన్‌మెన్ షేర్లన్నింటినీ కొనుగోలు చేయనుంది. అనంతరం దీనికి అదాని డిజిటల్ ల్యాబ్స్ అనే పేరు పెట్టనుంది. దీనికోసం ఎంత మొత్తాన్ని ఖర్చు చేయబోతోన్నామనేది అదాని ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించలేదు.

ట్రైన్‌ మెన్ ప్లాట్ ఫామ్‌ను స్టార్క్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ స్టార్క్ కంపెనీని తాము వందశాతం మేర కొనుగోలు చేయనున్నట్లు అదాని ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలను పంపించింది కూడా. స్టార్క్ ఎంటర్‌ప్రైజెస్‌తో షేర్ పర్ఛేజ్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకున్నట్లు వివరించింది.

అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు కూడా రైల్వే టికెట్ల అమ్మకాల రంగంలో అడుగుపెట్టడం వల్ల ఐఆర్‌సీటీసీ మరింత గట్టిపోటీని ఎదుర్కొంటుందనడంలో సందేహాలు అక్కర్లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తన ఆధిపత్యాన్ని పోగొట్టుకోవడానికి ఎంతో కాలం ఎదురు చూసే పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా వేస్తోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+