రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ శుభవార్త.. అదానీ గ్రూప్ కీలక నిర్ణయం
భారత్ లోని మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత పెంచేందుకు అదానీ గ్రూప్ మరో ముందడుగు వేసింది. భారత్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలన్న లక్ష్యంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రెండో పబ్లిక్ ఇష్యూ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్(NCD)లను ప్రారంభించినట్లు ప్రకటించింది.
అదానీ గ్రూప్స్ లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. భారత్ మౌలిక సదుపాయాల అభివృద్దిని పెంచడంలో 1993 నుండి ఈ సంస్థ పనిచేస్తోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారత్ లోనే అతిపెద్ద లిస్టెడ్ బిజినెస్ ఇంక్యుబేటర్ గా ఈ సంస్థ గుర్తింపు పొందింది. తాజాగా సెక్యూర్డ్, రేటెడ్, లిస్టెడ్ రిడీమబుల్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రెండో పబ్లిక్ ఇష్యూను ప్రారంభించింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తొలి NCD ఇష్యూ రూ. 800 కోట్లు మొదటి రోజే పూర్తి సబ్ స్క్రైబ్ అయింది. ఇదే విషయాన్ని అదానీ గ్రూప్ CFO జుగేశిందర్ రాబీ సింగ్ వెల్లడించారు. "AEL రెండో పబ్లిక్ NCD ఇష్యూ, సమ్మిళిత మూలధన మార్కెట్ ల వృద్ధికి, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రిటైల్ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుంది. అదానీ పోర్ట్స్ , SEZ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీతో పాటు ఇప్పుడు అదానీ సంస్థ.. విమానాశ్రయాలు, రోడ్లు, డేటా సెంటర్ లు, గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ ఇలా ప్రతి రంగంలోనూ మౌలిక సదుపాయాల కల్పనను విజయవంతంగా అందుకుంటోంది. ఈ ఒక్కో విభాగం భారత్ ను 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపిస్తుంది" అని అదానీ గ్రూప్ CFO జుగేశిందర్ రాబీ సింగ్ తెలిపారు.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం లిస్టెడ్ డెట్ ప్రోడక్ట్ ను అందిస్తున్న ఏకైక కార్పొరేట్ సంస్థ AEL మాత్రమే కావడం విశేషం. ఈ విధానం ద్వారా వ్యక్తిగత, నాన్-ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ లకు భారత్ మౌలిక సదుపాయాల వృద్ధిలో పాల్గొనడానికి ఒక అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఇటీవల రేటు తగ్గింపులు, తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన, ఫిక్స్‌డ్- ఇన్ కమ్ మార్గాలను కోరుకునే పెట్టుబడిదారులకు ఇది సరైన సమయంగా చెప్పొచ్చు.
ఇష్యూ యొక్క బేస్ సైజు రూ. 500 కోట్లు, అదనంగా రూ. 500 కోట్ల వరకు ఓవర్-సబ్‌స్క్రిప్షన్ ను నిలుపుకునే అవకాశం ఉంది ("గ్రీన్ షూ ఆప్షన్") మొత్తం రూ. 1,000 కోట్ల వరకు ఉంటుంది ("ఇష్యూ" లేదా "ఇష్యూ సైజు"). ఈ ఇష్యూ జూలై 9, 2025న ప్రారంభమై జూలై 22, 2025న ముగుస్తుంది. ముందుగా ముగించే లేదా పొడిగించే అవకాశం కూడా ఉంది. NCDల ముఖ విలువ ఒక్కొక్కటి రూ. 1000. ప్రతి దరఖాస్తు కనీసం 10 NCDలకు, ఆ తర్వాత 1 NCD మల్టిప్లైలో ఉండాలి. కనీస దరఖాస్తు పరిమాణం రూ. 10,000 అవుతుంది.
ఇష్యూ నుండి వచ్చే ఆదాయంలో కనీసం 75శాతం కంపెనీ తీసుకున్న ప్రస్తుత రుణాన్ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని ముందుగా చెల్లించడానికి లేదా తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తారు. మిగిలిన నిధులను (గరిష్టంగా 25% వరకు) సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తారు. నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టిప్సన్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్ లుగా వ్యవహరిస్తున్నాయి.

NCDల ఇష్యూ ధర ఒక్కో NCDకి రూ.1,000. కనీస దరఖాస్తు పరిమాణం రూ. 10,000 (10 NCDలు) మరియు ఆ తర్వాత రూ. 1,000 (1 NCD) గుణిజాలలో ఉంటుంది. వడ్డీ చెల్లింపు వివిధ మార్గాల ద్వారా జరుగుతుంది.. రుణ స్వభావం సురక్షితంగా ఉంటుంది. ఈ NCD ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ తన రుణభారాన్ని తగ్గించుకోవడానికి, ఇతర కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనుంది. ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి లేని రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications