వస్తుంటాయి..పోతుంటాయి- ఇందులో కొత్తేముంది?: అదాని వ్యవహారంపై నిర్మల సీతారామన్
గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు మోసాలకు పాల్పడిందంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు.
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు వేల కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చెలరేగిన వివాదానికి తెర పడట్లేదు. అదాని సంస్థలన్నింటినీ దాదాపుగా దివాళా తీయించే స్థితికి తీసుకొచ్చిందీ నివేదిక. అదాని ఎంటర్ ప్రైజెస్ ఇదివరకు ప్రకటించిన 20,000 కోట్ల రూపాయల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ను కూడా రద్దు చేయాల్సి పరిస్థితి వచ్చింది. గౌతమ్ అదాని ఆస్తులను హరించివేసింది.

అపర కుబేరుల జాబితా నుంచి..
హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక దెబ్బకు ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఒకడిగా ఉన్న గౌతమ్ అదాని- ఆ జాబితా నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ రిపోర్ట్ ను అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల యాజమాన్యం తోసిపుచ్చింది. అందులో పొందుపరిచిన అంశాలేవీ వాస్తవం కాదని తేల్చి చెప్పింది. తమ నుంచి కనీసం వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదని, ఉద్దేశపూరకంగా ఆ నివేదికను రూపొందించిందని ఆరోపించింది. ఆర్థిక మోసాలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసింది.

అదాని షేర్ పతనమైనా.. కోలుకుంది..
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని స్వయంగా వివరణ ఇచ్చినప్పటికీ.. ఆ సంస్థల షేర్ల పతనానికి బ్రేకుల పడట్లేదు. అదాని షేర్లు భారీగా నష్ట పోయాయి. శుక్రవారం స్టాక్ మార్కెట్లల్లో అదాని ఎంటర్ ప్రైజెస్ షేర్ విలువ ఒక దశలో 1,017 రూపాయలకు క్షీణించింది. ఆ తరువాత కోలుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.1,586.80 పైసల వద్ద నిలిచింది. ఇప్పటికే అదానీ షేర్ల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయిన విషయం తెలిసిందే.

పార్లమెంట్ లో డిమాండ్
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పార్లమెంట్ ను స్తంభింపజేస్తోన్నారు. గౌతమ్ అదాని- వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నారు. కళ్ల ముందే ఇన్ని మోసాలు జరుగుతున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందంటూ నిలదీస్తోన్నారు.

ఎఫ్‌పీఓలు వస్తుంటాయి.. పోతుంటాయి..
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా స్పందించారు. అదాని ఎంటర్ ప్రైజెస్ ఎఫ్‌పీఓను రద్దు చేసుకోవడంపై స్పందించారు. ఎఫ్‌పీఓలు వస్తుంటాయి..పోతుంటాయని వ్యాఖ్యానించారు. ఇవ్వాళ ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నిసార్లు ఎఫ్‌పీఓలు మార్కెట్‌లోకి రాలేదు? ఎన్నిసార్లు వెనక్కి వెళ్లలేదు? అని ఆమె విలేకరులకు ఎదురు ప్రశ్న వేశారు. స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు సర్వ సాధారణమేనని స్పష్టం చేశారు.

ఎలాంటి ప్రభావం పడదు..
గౌతమ్ అదాని తన ఎఫ్‌పీఓను ఉపసంహరించుకోవడం పట్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపదని నిర్మల సీతారామన్ అన్నారు. అదాని వ్యవహారాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఎల్ఐసీ, జాతీయ బ్యాంకులు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. స్టాక్ మార్కెట్ లో ఈ హెచ్చుతగ్గులు సాధారణమేననీ అన్నారు. అదాని సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా విదేశీ మారకద్రవ్యం నిల్వలు ఎనిమిది బిలియన్ డాలర్ల మేర రికార్డయ్యాయని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.

రెగ్యులేటర్లు స్వతంత్రంగా..
మార్కెట్ రెగ్యులేటర్స్ స్వతంత్రంగా పని చేస్తుంటాయని, ప్రభుత్వ ఆధీనంలో అవి ఉండవని నిర్మల సీతారామన్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అదానిపై రిజర్వ్ బ్యాంక్ ఇదివరకే ఓ ప్రకటన చేసిందని గుర్తు చేశారు. మార్కెట్‌ను నియంత్రణలో ఉంచడమే రెగ్యులేటర్ల ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications