Aditya L1: డేటా సేకరణ ప్రారంభించిన ఆదిత్య ఎల్1, సూర్యుడి దిశగా మరో ముందడుగు
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనల కోసం పంపిన ఆదిత్య ఎల్1(Aditya L1) మరో మైలురాయి దిశగా సాగుతోంది. తాజాగా, ఆదిత్య ఎల్1 డేటాను సేకరించడం మొదలు పెట్టింది. అది భూమికి దాదాపు 50,000 కిలోమీటర్లకుపైగా దూరంలో సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది.
వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్1లోని స్టెప్స్(సూపర్ థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్) గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సేకరించిన డేటా శక్తివంతమైన కణాల పర్యావరణంలో వైవిధ్యాలను ప్రదర్శిస్తుందని ఇస్రో పేర్కొంది.

ఆదిత్య ఎల్1 సెప్టెంబర్ 19వ తేదీన కీలక దశకు చేరుకుంటుంది. దీని భూప్రదక్షిణ దశ ముగియనుంది. సెప్టెంబర్ 19వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించనుంది. ఈ క్రమంలో ఇది సన్-ఎర్త్ లగ్రాంజ్ 1కు చేరుకుంటుంది. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 18, 2023
Aditya-L1 has commenced collecting scientific data.
The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth.
This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri
ఈ పాయింట్‌లో సూర్యుడు, భూమి, గురుత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకుని ఏదైనా స్థిరంగా ఉండవచ్చు. ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్ పాయింట్లను గుర్తించారు. వీటిలో భారత్ కు చెందిన ఆదిత్య ఎల్1 తొలి లగ్రాంజ్ పాయంట్‌కు వెళుతోంది. ఇందుకు నాలుగు నెలల సమయం పడుతుంది.
ఆదిత్య ఎల్1 శాటిలైట్ లో మొత్తం 7 పేలోడ్స్ అమర్చారు. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ తోపాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయనున్నాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతోపాటు అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేయనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications