Jharkhand Polls: జార్ఖండ్ రెండో దశలో కోటీశ్వరుల హవా-ఏడీఆర్ రిపోర్ట్..!

నవంబర్ 20న జరిగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో కోటీశ్వరుల హవా కనిపిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో పోటీ చేస్తున్న 522 మంది అభ్యర్థులలో 127 లేదా 24 శాతం మంది కోటి కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. వారిలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన పకూర్ నియోజకవర్గం అభ్యర్ధి అక్విల్ అక్తర్ టాప్ లో ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ అత్యధికంగా 32 మంది కోటీశ్వరుల్ని పోటీలో నిలబెట్టిందని తాజాగా విడుదలైన ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.

ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. జార్ఖండ్ రెండో దశ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో 32 మందిలో 23 మంది అంటే 72 శాతం కోటీశ్వరులున్నారు. అలాగే జేఎంఎం నుంచి పోటీ చేస్తున్న 20 మందిలో 18 మంది అంటే 90 శాతం, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 12 మందిలో 10 మంది అంటే 83 శాతం మంది కోటీశ్వరులున్నారని రిపోర్ట్ తెలిపింది. ఇంకా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి ఆరుగురు, బీఎస్పీ నుంచి నలుగురు, ఆర్జేడీ నుంచి ఇద్దరు కోటీశ్వరులున్నారు.

ADR report says one fourth of Jharkhand elections second phase candidates are crorepatis

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి ఆస్తుల సగటు విలువ 2.53 కోట్లుగా ఉందని ఏడీఆర్ తెలిపింది. పార్టీల వారీగా సగటు ఆస్తులను పరిశీలిస్తే ఇద్దరు ఆర్జేడీ అభ్యర్థులకు రూ.24.18 కోట్లు, ఆరుగురు AJSU అభ్యర్థుల సగటు రూ.9.20 కోట్లు, 20 JMM అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.7.48 కోట్లుగా తేలింది. అలాగే 32 మంది బీజేపీ అభ్యర్థుల సగటు రూ.5.05 కోట్లు, 12 మంది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు రూ.3.10 కోట్లు, 24 బీఎస్పీ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.67 లక్షలుగా ఉంది. అత్యధిక ఆస్తులు కలిగిన ముగ్గురు అభ్యర్థులు పైన ఏ లిస్ట్ లో లేకపోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+