వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే..! కశ్మీర్‌ విషయంలో పాక్ కు షాకిచ్చిన అఫ్గాన్‌..!!

|
Google Oneindia TeluguNews

కాబూల్/హైదరాబాద్ : కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ కు రోజుకో చేదు అనుభవం ఎదురవుతోంది. అగ్ర దేశమైన అమెరికాతో ప్రతిరోజూ చివాట్లు తింటున్న పాకిస్తాన్ కు తాజాగా పొరుగుదేశమైన అఫ్గనిస్తాన్ తో శత్రుత్వం కొనితెచ్చుకుంది. పాకిస్తాన్ కు ఎదురౌతున్న ప్రతికూల పరిస్థితుల్లోకి అఫ్గనిస్తాన్ ను ఎందుకు లాగే ప్రయత్నం చేస్తున్నారని అఫ్గానిస్థాన్ అంబాసిడర్‌ రోయా రహ్మానీ పాకిస్తాన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో అఫ్గనిస్తాన్ అడిగిన ప్రశ్నకు ఎలాంటి బదులివ్వాలో పాకిస్తాన్ కు అర్ధం కాక తలపట్టుకునన్నట్టు తెలుస్తోంది.

కష్ట కాలంలో కలిసి వస్తుందనుకున్న పక్క దేశం ఇంత కర్కషంగా వ్యవహరించడాన్ని పాక్ జీర్ణించుకోలేక పోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని మోహరింపజేచడం పట్ల కూడా అఫ్గనిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ ఉద్దేశమేంటో అంతుచిక్కకుండా ఉందని, సరిహద్దు వెంట సైన్యాన్ని దింపడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని అఫ్గన్ నిలదీస్తోంది.కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు వంటి విషయాల్లో పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై పాక్‌పై అఫ్గానిస్థాన్‌ మండిపడింది. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అఫ్గానిస్తాన్ కు ఆపాదించి మాట్లాడటం ఆపేయాలని పాకిస్థాన్‌కు హితవు పలికింది.

Afghanistan firing on Pak in Kashmir issue..!!

తమ దేశంపై పాక్‌ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని, అమెరికా యొక్క అఫ్గానిస్థాన్ అంబాసిడర్‌ రోయా రహ్మానీ ఓ లేఖను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. 'అమెరికా యొక్క పాకిస్థాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌ అఫ్గానిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దీనిపై గట్టిగా ప్రశ్నిస్తున్నాం. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు అఫ్గానిస్థాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న వారి వ్యాఖ్యలు అర్థరహితం. పాక్‌కు అఫ్గాన్‌ నుంచి ఎలాంటి ప్రమాదం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వేలాది మంది మిలటరీ బృందాలను ఎందుకు పెట్టిందో మాకు సరైన కారణం కనిపించడంలేదు.

పాకిస్థాన్‌లో ఉండే ఉగ్రవాదుల నుంచి అఫ్గాన్‌కు తరచూ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. మా దేశం వైపు ఉసిగొల్పేలా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒక వేళ ఇందులో పాక్‌ పాత్ర లేకపోతే బహిరంగంగా దీనిపై మాట్లాడాలి. ఉగ్రవాదంపై కఠిన చట్టాలను అమలు పరచాలి' అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ పాదకిస్తాన్ లో రాజకీయ ప్రకంపనలు సృస్టిస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
US's Afghanistan ambassador, Roia Rahwani urged Pakistan to stop talking and to attribute the situation in Kashmir to Afghanistan. Pakistan is speaking meaning responsibly and irresponsible on their country, and the US's Afghanistan ambassador, Roia Rahwani, has released a letter by Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X