44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర: జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత
Mallojula Venugopal Rao: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బుధవారం తన 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. ముఖ్యమంత్రి సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. దాదాపు మావోయిస్టు పార్టీ రెండో అగ్రస్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి ఇబ్బందికరమే. ఈ పరిణామాలను గమనిస్తే.. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బగా పేర్కొంటున్నారు.
మరోవైపు మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదని కొన్ని రోజుల నుంచి మల్లోజుల వేణుగోపాల్ బహిరంగ లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పార్టీ పొలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మల్లోజులపై దాదాపు వందకు పైగా కేసులు కూడా ఉన్నాయి. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. మల్లోజుల లొంగిపోవడంతో 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెరపడింది.

మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణకు చెందినవాడు కావడం గమనార్హం. మల్లోజుల పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధరమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పని చేసిన తండ్రి వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు నుంచి స్ఫూర్తి పొంది.. చదువు పూర్తయిన తర్వాత అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు. అయితే వేణుగోపాల్ రావు లొంగుబాటు వెనుక సినిమాటిక్ పరిణామాలు చోటుచేసుకున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి.
#WATCH | Gadchiroli, Maharashtra: Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati, surrenders in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 Naxalites surrendered today.
— ANI (@ANI) October 15, 2025
Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati gave a… pic.twitter.com/stBiJWEJvd
లొంగుబాటుకు కారణాలు ఇవేనా?
మల్లోజుల వేణుగోపాల్ రావు భార్య తారక్క కూడా ఈ ఏడాది జనవరిలో లొంగిపోవడం గమనార్హం. ఆమె కూడా మావోయిస్టు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె మరో 10 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో చేరారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు వేణుగోపాల్, మహారాష్ట్ర భద్రతా సంస్థల మధ్య విశ్వాసాన్ని పెంపొందించాయి. మరోవైపు ఈ ఏడాది మే నెలలో
ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ప్రాణాలు విడిచిన అనంతరం పార్టీ తదుపరి నాయకత్వ బాధ్యతలు అప్పగింత వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీకి తదుపరి నాయకత్వం వహించే నేతల్లో వేణుగోపాల్‌రావు పేరు వినిపించినప్పటికీ.. ఆ బాధ్యతలు చివరకు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీకి అప్పగించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర సర్కారు చేపట్టిన ఆపరేషన్ కగార్.. మావోయిస్టుల ఉనికికి పెను ప్రమాదంగా మారింది. వందలాది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా... అందులో కీలక నేతలు కూడా ఉన్నారు.
అయితే పార్టీ సారథ్యం దక్కకపోవడం వేణుగోపాల్ రావులో తీవ్ర ఆగ్రహాన్ని సృష్టించిందని... కాలక్రమేణా ఆయన లొంగిపోవడానికి నమ్మకమైన మార్గం కోసం వెతకడం ప్రారంభించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో కీలక మావోయిస్టులు మరణించడంతో ఆ ప్రాంతంలో లొంగిపోతే ప్రతీకారం ఉంటుందనే భయంతో ఆయన అక్కడ లొంగిపోకుండా ఉన్నారనే ప్రచారం కూడా ఉంది.
అయితే తన స్వరాష్ట్రమైన తెలంగాణ కూడా తన లొంగిపోయే ప్రయత్నాలకు సహకరించదని ఆయన భావించారని, అంతేకాకుండా హైదరాబాద్ చేరుకోవడానికి విస్తారమైన అడవులను దాటవలసి ఉంటుందని ఇది చాలా ప్రమాదకరమని అనుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ఆయన మొగ్గు చూపారు. గతంలో చాలా మంది లొంగిపోయిన మావోయిస్టులకు మహారాష్ట్ర సర్కారు పునరావాసం కలిగించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయినట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications