వీళ్లు కదా లీడర్స్ అంటే:అక్కడ విమర్శనాస్త్రాలు.. ఇక్కడ నవ్వుల్ పువ్వుల్..!

అసెంబ్లీలో వాడీవేడీ చర్చ అనంతరం సీఎం యోగీ ఆదిత్యనాథ్ అఖిలేష్ యాదవ్‌లు స్పీకర్ ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంకు హాజరయ్యారు.

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లు ఒకే చోట కనిపించారు. ఇందులో వింతేముంది అంటారా.. వీరిద్దరూ ఒకే చోట చేరకముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. వాగ్వాదంకు దిగారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరూ భోజనం దగ్గర కనిపించారు. అయితే ఈ భోజనం ఏర్పాటు చేసింది స్పీకర్ సతీష్ మహాన. ఇరు నేతల మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్‌కు వెళ్లిపోవడంతో వారిమధ్య దూరంను తగ్గించి గొడవ సద్దుమణిగేలా చేసేందుకు ఈ భోజన కార్యక్రమం స్వయంగా స్పీకర్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి. అప్పటి వరకు యోగీ ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్‌లు కస్సు బుస్సుగా కనిపించినప్పటికీ.. భోజనం దగ్గర చేరుకునే సరికి ఇద్దరి ముఖాల్లో నవ్వు కనిపించింది. పరస్పర గౌరవంతో ఇరునేతలు మాట్లాడుకున్నారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. రెండు పార్టీల నాయకులు ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు మంచి చెడ్డలు అనడం వంటి సంఘటనలు తరచుగా కనిపిస్తాయి.ఆ తరువాత ఇద్దరు నాయకులు కలిసి కనిపిస్తారు. ఇదంతా రాజకీయ వైరమే కానీ వ్యక్తిగత వైరం కానే కాదు. రాజకీయంగా యోగీ ఆదిత్యనాథ్‌పై అఖిలేష్ యాదవ్ విమర్శలు సంధించడం అస్సలు ఆపలేదు. అదే సమయంలో ఎస్పీ అధినేత అఖిలేష్‌ను టార్గెట్ చేయడంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా తగ్గలేదు.

After a heated argument in assembly CM Yogi and SP chief Akhilesh have all smiles at a lunch meet
ప్రయాగ్‌రాజ్ ఘటనపై వాడీవేడీ చర్చ జరిగిన అనంతరం స్పీకర్ ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి ఇరునేతలు హాజరయ్యారు.తన మామ శివ్‌పాల్ యాదవ్‌తో కలిసి అఖిలేష్ యాదవ్ లంచ్‌కు హాజరయ్యారు.అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీలను భోజనానికి పిలిచినందుకు స్పీకర్‌ సతీష్ మహానాను అభినందించారు ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్. ప్రయాగ్‌రాజ్ ఘటనపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. మాఫియాను వెనుకేసుకొచ్చింది సమాజ్‌వాదీ పార్టీ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మాఫియాను ఉక్కుపాదంతో తొక్కేస్తామని సభాముఖంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+