గోడ కూలి తెలుగువారు మృతి: బాబు, జగన్ దిగ్భ్రాంతి
చెన్నై: తమిళనాడులో మరో విషాదం. తిరువళ్ళూరు జిల్లా ఉపరపలయం వద్ద వర్షం వల్ల ఓ గోడ కూలిన ప్రమాదంలో 11 మంది తెలుగు వారు దుర్మరణం చెందారు. వర్షం కారణంగా ఓ గోడౌన్ గోడ కూలడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతులను తెలుగువారిగా గుర్తించారు.
కార్మికులు గోడౌన్ గోడ ఆసరాగా గుడిసెలు వేసుకున్నారు. సరిగ్గా ఆ గుడిసెల పైనే గోడ కూలడంతో ప్రాణనష్టం సంభవించింది. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. భారీ వర్షం వల్ల 20 అడుగుల ప్రహరీ గోడ కూలింది.

చంద్రబాబు, జగన్ దిగ్భ్రాంతి
తిరువళ్లూరు జిల్లా ఉపరవలయం వద్ద గోడ కూలి 11 మంది మృతి చెందిన ఘటన పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలికి అధికారులను పంపించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications