సామాజిక లాంఛనమే: నరేంద్ర మోడీ పెళ్లిపై సోదరుడు

అహ్మదాబాద్: తన సోదరుడి వివాహ స్థితిపై చెలరేగుతున్న వివాదానికి తెర దించేందుకు బిజెపి ప్రధాని అభ్యర్థి సోదరుడు సోమాబాయ్ రంగంలోకి దిగారు. యాభై ఏళ్ల క్రితం జరిగిన మోడీ వివాహాన్ని సామాజిక లాంఛనంగానే చూడాలని ఆయన అన్నారు. వడదొర లోకసభ స్థానానికి వేసిన నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో మోడీ తొలిసారి తన భార్య జోషాదాబెన్ పేరును ప్రస్తావించారు.

శాసనసభ ఎన్నికల సందర్బంగా సమర్పించిన అఫిడవిట్లలో మాత్రం ఆయన భార్య కాలమ్‌ను ఖాళీగా ఉంచుతూ వచ్చారు. తమ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదని, తమది పేద కుటుంబమని, తమ తల్లిదండ్రులకు మోడీ మిగతా పిల్లలాంటివారేనని, తమ తల్లిదండ్రులు మోడీకి ఎప్పుడో పెళ్లి చేశారని, అది సామాజికపరమైన లాంఛనంగా మాత్రమే చేశారని ఆయన వివరణ ఇచ్చారు.

After Modi admits he was married, his brother says it was a 'social formality'

ఆ మేరకు ఆయన గురువారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మోడీ కుటుంబంతో ఏ విధమైన సంబంధం పెట్టుకోలేదని చెప్పారు. దేశానికి సేవ చేయడమే మోడీ మతమని, దాంతో మోడీ ఇంటిని వదిలేశారని, వస్తుప్రపంచాన్ని కాదని వెళ్లిపోయాడని ఆయన అన్నారు.

పెళ్లి కాగానే మోడీ ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అందువల్ల వివాహం లాంఛనమేనని ఆయన అన్నారు. జోషాదాబెన్ తన తండ్రి ఇంటిలోనే ఉంటున్నారని, విద్యారంగంలో పని చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆయన చెప్పారు. మోడీ వివాహాన్ని పేద కుటుంబాల్లో, సంప్రదాయబద్దమైన సనాతన కుటుంబాల్లో జరిగినదానిగా చూడాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+