ఒక్క ఫోటోతో విమర్శకుల నోళ్లు మూయించిన స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్
అకాడెమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఆయన కూతురు కటీజాలు ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు గాను స్వరమాంత్రికుడు రెహ్మాన్ ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అవార్డు అందుకుని 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో రెహ్మాన్ కూతురు ఖటీజా భావోద్వేగంతో ప్రసంగించారు. ఆసమయంలో ఆమె బురఖా ధరించి ప్రసంగించడంతో నెటిజెన్లు ఆమెను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. కూతురితో రెహ్మాన్ బలవంతంగా బురఖా ధరించారని నెటిజెన్లు ఆయనపై కూడా విమర్శలు గుప్పించారు.

విమర్శించిన వారి నోళ్లు మూయించేలా తన ముగ్గురు పిల్లల ఫోటోను పోస్టు చేసి సమాధానం చెప్పారు రెహ్మాన్. ఖటీజ, రహీమ, ఏఆర్ అమీన్‌లు కలసి ఉన్న ఫోటోను రెహ్మాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈసారి మాత్రం ఓ ఫోటో షూట్ కోసం వారంతా ఒక్కదగ్గరకు చేరారు. కొద్దిరోజుల క్రితం బురఖా ధరించి వేదికపై కనిపించిన ఖటీజా ఈ ఫోటో షూట్‌లో కూడా బురఖా ధరించే కనిపించారు. మిగతా ఇద్దరు మాత్రం ఫ్యాషన్ దుస్తులు ధరించి కనిపించడం విశేషం. ఇక ఈ ఫోటోనే రెహ్మాన్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతేకాదు వారు ఓ మ్యాగజీన్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్నట్లు రెహ్మాన్ చెప్పారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. పోస్టు చేసిన 15 గంటల్లోనే ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. ఈ ఫోటోకు 15 గంటల్లోనే ఇన్స్‌టాగ్రామ్‌లో 2 లక్షల లైక్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఖటీజీ అమీన్‌లు బ్లాక్ కలర్ డ్రెస్‌లో దర్శనమివ్వగా... రహీమా గ్రీన్ కలర్ లెన్త్ గౌను ధరించింది. ముగ్గురు పిల్లలు ఎంతో క్యూట్‌గా ఉన్నారంటూ పలువురు కామెంట్ చేశారు. మరోవైపు బురఖా వివాదాన్ని చాలా తెలివిగా వ్యవహరించి చెక్ పెట్టిన రెహ్మాన్ అతని కూతురు ఖటీజాలను చాలామంది ప్రశంసించారు. అయితే ఖటీజా మాత్రం తన అభిరుచి ఏమిటో ఎవరితో ఎలా మెలగాలో తనకు తెలుసునని ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పింది.












Click it and Unblock the Notifications