2వేలమంది వేధించారు, వీడియోలు రావొచ్చు!: రోహతక్ సిస్టర్స్, ట్విస్ట్‌లు
రోహతక్: హర్యానా రాష్ట్రంలోని రోహతక్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు.. బస్సులో తమను వేధిస్తున్న ముగ్గురు యువకులను, పార్క్‌లో మరో యువకుడిని చితకబాదిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, బస్సులో తాము చితకబాదిన విషయం వీడియో తీసి, నెట్లో పెట్టిన విషయం గురించి తమకు తెలియదని ఆ అక్కా చెల్లెళ్లు పూజ, ఆర్తి చెప్పారు.
అయితే, బస్సులోనే కాకుండా, పార్క్‌లో కూడా ఇలా ఆ యువతులు కొట్టిన సంఘటనలే వీడియోలుగా ఎందుకు బయటకు వస్తున్నాయనే విషయమై ఆ సిస్టర్స్ స్పందించారు. మరికొన్ని వీడియోలు కూడా రావొచ్చునని చెప్పారు. తన వయస్సు 19 ఏళ్లు అని, ఇప్పటి వరకు తనను రెండువేలమంది వరకు లైంగికంగా వేధించి ఉంటారని, తనకు అవకాశం వస్తే వారిని చితకబాదుతున్నానని పూజ చెప్పారు. ఆమె సోదరి ఆర్తి వయస్సు 22.

కాగా, రోహతక్ అక్కాచెల్లెళ్లకు సంబంధించిన రెండు వీడియోలు నెట్లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బస్సు ఘటన తర్వాత పార్క్‌లో ఓ యువకుడిని చితకబాదిన వీడియో వచచింది. ఈ ఘటనపై వారు మాట్లాడుతూ.. ఇది ఒక నెల క్రితం జరిగిన ఘటన అని చెప్పారు.
ప్రస్తుతం అది మీడియాలో ప్రసారమవుతోందని అన్నారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆ ఇద్దరు సోదరీమణులు చెప్పారు. ప్రచారం కోసమే ఇలాంటి చర్యలకు దిగుతున్నామనడం సరికాదని ఆ సోదరీమణులు అన్నారు. ఈ అక్కా చెల్లెళ్లు ఇటీవలే బస్సులో తమను వేధింపులకు గురి చేసిన ముగ్గురు యువకులను బెల్టుతో చితకబాది పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.
దెబ్బలు తిన్న యువకులకు బాసట
బస్సులో దెబ్బలు తిన్న యువకులకు వారి గ్రామస్థులు బాసటగా నిలిచారు. వారికి అండగా నిలవాలని మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. సీటు గురించి వచ్చిన గొడవతో వారి మధ్య ఘర్షణ జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు, బస్సులో అడ్డుకున్న గర్బిణీని ట్రేస్ చేయలేకపోయారు.












Click it and Unblock the Notifications