ఎన్సీపి షాక్: పొత్తు కోసం ఎస్పీతో కాంగ్రెస్ మంతనాలు

ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు పొత్తు విషయంపై చర్చించారని కాంగ్రెస్ పార్టీ సన్నిహిత వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలిపాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పలు విషయాల్లో విభేదాల కారణంగా ఎన్సీపి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎస్పీ అగ్రనాయకులతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినట్లు సమాచారం. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అజ్మీ కూడా రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య అనేక విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ శివసేన, భారతీయ జనతా పార్టీలను ఓటించాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, తమ పార్టీని సంప్రదించకుండా 118మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తన మొదటి జాబితాను ప్రకటించడంతో ఆగ్రహానికి గురైన ఎన్సీపి 15ఏళ్ల బంధానికి ముగింపు పలికింది.
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications