ఇండియా కూటమికి భారత్ పేరు ? అబ్రివేషన్ కూడా చెప్పిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్..!
ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ విపక్ష ఎంపీలు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. జైరాం రమేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఇండియా పేరును భారత్ గా మార్చడాన్ని వ్యతిరేకిస్తుండగా.. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ మాత్రం దీన్ని సమర్ధించారు. దీనిపైనే కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతు్న వేళ ఆయన మరో కీలక సూచన చేశారు.
ఈసారి శశిథరూర్ ఏకంగా భారత్ పేరును ఇండియా కూటమికి పెట్టాలని కీలక సూచన చేశారు. అక్కడితో ఆగకుండా భారత్ పేరుకు సైతం ఇండియా పేరు తరహాలోనే ఓ అబ్రివేషన్ కూడా చెప్పేశారు. ప్రతిపక్ష కూటమి తమను తాము "అలయన్స్ ఫర్ బెటర్‌మెంట్, హార్మొనీ మరియు రెస్పాన్సిబుల్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ టుమారో (భారత్)" అని పిలవాలని థరూర్ సూచించారు.తద్వారా పేర్లు మార్చే దుర్మార్గపు చర్యల్ని ఆపవచ్చని ఆయన తెలిపారు.

ఇవాళ X లో పెట్టిన పోస్ట్‌లో థరూర్ ... "మనల్ని మనం అలయన్స్ ఫర్ బెటర్‌మెంట్, హార్మొనీ మరియు రెస్పాన్సిబుల్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ టుమారో (భారత్) అని పిలుస్తామని, తద్వారా అధికార పార్టీ పేర్లను మార్చే ఈ దుర్మార్గపు ఆటను ఆపవచ్చు." అన్నారు. ఇప్పటికే తన సొంత పార్టీ కాంగ్రెస్... విపక్ష ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా)కూటమిలో భాగంగా ఉన్న నేపథ్యంలో చేసిన ఈ సూచన చర్చనీయాంశమవుతోంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఇండియా పేరు మార్పుపై ట్విట్టర్లో.. మిస్టర్ మోడీ చరిత్రను వక్రీకరించడం మరియు భారతదేశాన్ని విభజించడం కొనసాగించవచ్చన్నారు, అది భారత్, ఇది రాష్ట్రాల యూనియన్ అన్నారు. కానీ తాము అడ్డుకోలేమన్నారు. అటు థరూర్ స్పందిస్తూ.. భారతదేశాన్ని భారత్ అని పిలవడానికి రాజ్యాంగబద్ధంగా ఎటువంటి అభ్యంతరం లేనప్పటికీ, 'గణించలేని బ్రాండ్ విలువ' ఉన్న భారత్ ను పూర్తిగా విడదీయడానికి ప్రభుత్వం అంత మూర్ఖంగా" ఉండదని తెలిపారు.












Click it and Unblock the Notifications