Rajkot: రాజ్ కోట్ విమానాశ్రయంలో కూలిన షెడ్ టెంట్..
ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లో ఈదురుగాలులతో భారీ వానలుపడుతున్నాయి. భారీ ఈదురుగాలులు, వర్షాలతో రాజ్ కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షెడ్ టెంట్ కూలిపోయింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. షెడ్ టెంట్ కూలడానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లో టెర్మినల్ 1 వద్ద షెడ్ కూలిపోయింది. ఢిల్లీలో తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో ఉదయం 5.20 గంటలకు షెడ్ కూలినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ప్యాసింజర్స్ పికప్ అండ్ డ్రాప్ షెడ్ కు ఉన్న పరదా గాలివానకు చినిగిపోయి కిందపడిపోయింది. అక్కడే ఉన్న క్యాబ్ లపై పడిపోయంది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ మరణించాడు.

ఐదుగురు గాయపడ్డారు. ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనను విమానాయాన శాఖ సీరియస్ గా తీసుకుంది. విచారణకు ఆదేశించింది.టెర్మినల్ ఒకటి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత రాజ్ కోట ఎయిర్ పోర్టు లో షెడ్ టెంట్ కూలడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం ముంబైలో భారీ వర్షం, ఈదురుగాలులలకు ఘట్‌కోపర్‌లో హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications