2,000 కి. మీ రేంజ్ మిస్సైల్- దీని దెబ్బకు పాకిస్తాన్ లోని సిటీలు లేచిపోతాయ్
అత్యాధునిక ఇంటర్మీడియట్ రేంజ్ అగ్నిప్రైమ్ క్షిపణిని రక్షణ మంత్రిత్వ శాఖ విజయవంతంగా పరీక్షించింది. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుండి దీన్ని సంధించింది. ఇలాంటి మిస్సైల్ ను డెవలప్ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్, మిస్సైల్.. దేశ అమ్ములపొదిలో లేవు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలలో ఓ కీలక సాంకేతిక మైలురాయిని అందుకున్నట్టయింది.
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్.. సంయుక్తంగా ఈ అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను అభివృద్ధి చేశాయి. ప్రత్యేకంగా రూపొందించిన రైలు బేస్డ్ మొబైల్ ప్లాట్‌ఫామ్ నుండి ఈ ప్రయోగాన్ని నిర్వహివంచారు. అవసరం వచ్చినప్పుడు అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను దేశంలో ఉన్న అన్ని రైల్వే నెట్‌వర్క్‌ల పరిధిలో ఉన్న ప్లాట్ ఫామ్ లను ముందస్తు అనుమతి లేకుండా కేంద్రం వినియోగించుకోగలదు.

శత్రువులతో తలపడాల్సి వచ్చినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా, దగ్గర్లో ఉన్న ఏ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నుంచి అయినా లేదా.. కదులుతున్న రైలు నుంచి అయినా సరే.. ఈ అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించవచ్చు. ఈ ఇంటర్మీడియట్ మిస్సైల్ రేంజ్.. 2,000 కిలోమీటర్లు. ఇన్ని కిలోమీటర్ల పరిధిలో గల లక్ష్యాలను ఈ క్షిపణి వందశాతం ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది.
India has carried out the successful launch of Intermediate Range Agni-Prime Missile from a Rail based Mobile launcher system. This next generation missile is designed to cover a range up to 2000 km and is equipped with various advanced features.
— Rajnath Singh (@rajnathsingh) September 25, 2025
The first-of-its-kind launch… pic.twitter.com/00GpGSNOeE
ఈ ప్రయోగం విజయవంతమైనందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. డీఆర్డీఓ, ఎస్ఎఫ్సీ, సాయుధ బలగాలను అభినందించారు. దేశం మొట్టమొదటి ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-ప్రైమ్ క్షిపణిని రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుండి విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. ఈ నెక్స్ట్ జెన్ క్షిపణిని 2000 కిలో మీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించడానికి రూపొందించామని వివరించారు. ప్రత్యేకంగా రూపొందించిన రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ నుండి చేపట్టిన మొట్టమొదటి ప్రయోగంగా అభివర్ణించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications