Union Budget-2020 : రైతులకు రూ.15లక్షల కోట్ల రుణాలు..: నిర్మలా సీతారామన్
Recommended Video
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించినట్టు చెప్పారు. వాటిల్లో దేశ ఆకాంక్షలు,ఆర్థికాభివృద్ది,సమాజ శ్రద్ద ఉన్నాయి. సమాజంలోని అన్ని వర్గాల మెరుగైన జీవన ప్రమాణాలను కోరుకునే ఆకాంక్షల భారతదేశానికి ఆర్థికాభివృద్ధిని అందించగల శ్రద్ధగల సమాజాన్ని రూపొందించడమే తమ బడ్జెట్ ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీని చారిత్రాత్మక సంస్కరణగా అభివర్ణించారు. 2014 నుంచి 2019 వరకు భారత్ ఆర్థిక శక్తి 119 బిలియన్ల నుంచి 284 బిలియన్లకు పెరిగిందన్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా విశ్వాస్ లక్ష్యంతో బడ్జెట్‌ను రూపొందించినట్టు చెప్పారు.

2019-2020లో కొత్తగా 16లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగినట్టు నిర్మలా తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ భీమా యోజన ద్వారా 6.11కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారని చెప్పారు. 2021వరకు రైతులకు రూ.15లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాష్ట్రాల సహకారంతో చేయవచ్చునని చెప్పారు. 2022 వరకు దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు.
వ్యవసాయాధారిత,ఇరిగేషన్,గ్రామీణ అభివృద్ది కోసం రూ.2.83లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలోని 100 కరువు జిల్లాల్లో సమగ్ర చర్యలను ప్రతిపాదించినట్టు చెప్పారు.
బంజరు లేదా తడి భూములలో సౌర యూనిట్లను ఏర్పాటు చేయడానికి రైతులను అనుమతించాలని, గ్రిడ్లకు విద్యుత్ సరఫరా.చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.అలాగే వ్యవసాయ మార్కెట్లను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని, వ్యవసాయాన్ని మరింత పోటీగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయ-ఆధారిత కార్యకలాపాలు మరింత మెరుగవాలని, స్థిరమైన పంట పద్ధతులు మరియు మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications