అహ్మదాబాద్‌లోని "అదానీ విద్యా మందిర్‌‌"ను సందర్శించిన గుజరాత్ గవర్నర్..!

'ఛేంజ్‌మేకర్ సిరీస్' కార్యక్రమంలో భాగంగా గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్‌ అహ్మదాబాద్‌లోని అదానీ విద్యా మందిర్‌ (ఏవీఎం) సందర్శించారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ను అదానీ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతి అదానీ, ట్రస్టీ శ్రీమతి షిలిన్‌ అదానీ ఘనంగా ఆహ్వానించారు. విద్యార్థుల గౌరవ వందనం, సాంప్రదాయ వేడుకల మధ్య ఆయనకు హృదయపూర్వక స్వాగతం లభించింది. ఏవీఎం ప్రాంగణం విద్యార్థుల సందడితో కిక్కిరిసిపోయింది. అనంతరం ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.

గవర్నర్‌ ప్రేరణాత్మక ప్రసంగం..

విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆచార్య దేవవ్రత్‌ కృషి, నిజాయితీ, విలువల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించారు. "చిన్నతనం నుంచే కష్టపడి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నా విజయాన్ని సాధించవచ్చు. అలాంటి వారికి ప్రపంచంలో అవకాశాల కొరత ఉండదు" అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయుల జీవిత ప్రయాణాలను ఉదహరిస్తూ, కష్టాలను అధిగమించి ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచిన వారిని గుర్తు చేశారు.

ahmedabad-governor-vistis-adani-vidya-mandir-students

విద్యార్థులకు సూచనలు..

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నిరాడంబరంగా జీవించడం, భయం, సందేహం కలిగించే నిర్ణయాలకు దూరంగా ఉండడం వంటి అంశాలను ఆయన విద్యార్థులకు సూచించారు. నిజాయితీతో, బాధ్యతాయుతంగా ముందుకు సాగితే సమాజంలోనే కాదు, దేశ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించగలమని తెలిపారు.

ఏవీఎం ప్రత్యేకతపై ప్రశంసలు

ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏవీఎం ప్రత్యేక నమూనాను గవర్నర్‌ అభినందించారు. పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా, భోజనం, ఎక్స్‌ట్రా కరిక్యులర్ కార్యకలాపాలు-అన్నీ ఉచితంగా అందించడం ద్వారా మొదటి తరానికి చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతోందని అన్నారు.

2008లో స్థాపించబడిన అదానీ విద్యా మందిర్ ప్రస్తుతం నాలుగు ప్రాంతాల్లో (అహ్మదాబాద్‌, భద్రేశ్వర్‌, కృష్ణపట్నం, సుర్గుజా) సేవలు అందిస్తోంది. నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో కూడిన సంపూర్ణ విద్యను అందించడమే దీని లక్ష్యంగా చెబుతున్నారు. గతంలో నిశ్చల్ నారాయణ (భారతదేశపు అతి పిన్న వయస్కుడైన చార్టెడ్ అకౌంటెంట్), నటుడు-నిర్మాత జాన్ అబ్రహం, ISRO డైరెక్టర్ నిలేష్ దేశాయ్‌, యూనిసెఫ్‌ కంట్రీ హెడ్ సింథియా మెక్‌కాఫ్రే, అతి పిన్న వయస్కుడైన ఐపీఎస్‌ అధికారి సఫిన్ హసన్ వంటి ప్రముఖులు ఈ సిరీస్‌లో పాల్గొని విద్యార్థులను ప్రేరేపించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+