తమిళనాడు సీఎం స్ట్రైల్ మారింది, పాదాబివందనం, మళ్లీ జయలలిత స్ట్రైల్ లోనే !

అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా, తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన జయలలితకు ఆ పార్టీ నేతలు పాదాబివందనం చేసిన విషయం తెలిసిందే.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా, తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన జయలలితకు ఆ పార్టీ నేతలు పాదాబివందనం చేసిన విషయం తెలిసిందే. జయలలిత మరణించిన తరువాత పన్నీర్ సెల్వం, తరువాత ఎడప్పాడి పళనిసామి తమిళనాడు ముఖ్యమంత్రులు అయ్యారు.

జయలలిత మరణించిన తరువాత కొందరు నేతలు మాత్రం చిన్నమ్మ శశికళకు పాదాబివందనం చేసి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో పాదాబివందనం చేసే సాంప్రధాయానికి స్వస్తి చెప్పారు.

AIADMK cadres fall Edappadi Palanisamys feet

అయితే మంగళవారం అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి పాదాబివందనం చేసే సాంప్రధాయానికి తెరలేపారు. చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పళనిసామి వర్గం సమావేశం ఏర్పాటు చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల నాయకులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని సీఎం ఎడప్పాడి పళనిసామి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి హాజరుకావడానికి అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఎడప్పాడి పళనిసామిని ఆహ్వానించిన పార్టీ నేతలు ఒక్క సారిగా పాదాబివందనం చెయ్యడం మొదలు పెట్టారు. ఎవ్వరూ ఊహించని స్థాయిలో పళనిసామికి పాదాబివందనం చెయ్యడంతో కార్యకర్తలు షాక్ కు గురైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+