మళ్లీ నేనే సీఎం అవుతా: జయలలిత (ఫోటోలు)
చెన్నై: ఇదే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కకార్యకర్త సిద్దం కావాలని, అందరూ సంఘటిత శక్తిగా మారాలని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇటీవల పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జీ. రామచంద్రన్ ఆశయాలను నేరవేర్చడానికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని అన్నారు.
తమిళ సినిమా రంగం, తమిళ రాజకీయ రంగాల్లో దేదీప్యమానంగా వెలిగిన దివంగత ఎం.జీ. రామచంద్రన్ అందరికీ దూరం అయినా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు.

ఆయన కఠోరంగా శ్రమించారు
సినిమా, రాజకీయ రంగాల్లో ఎం.జీ. రామచంద్రన్ కఠోరంగా శ్రమించారని, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వారని జయలలిత గుర్తు చేశారు.

మరెన్నో తరాలకు మార్గదర్శకం
ఎం.జీ. రామచంద్రన్ మరెన్నో తరాలకు మార్గదర్శకంగా నిలిచారని, అందుకే ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని జయలలిత చెప్పారు.

ప్రజల కోసమే జీవితం
ప్రజల కోసం తాను నమ్మిన సిద్దాంతాలను అచరించి చూపించిన మహానేతగా ఎం.జీ. రామచంద్రన్ ప్రజలకు దేవుడు అయ్యారని జయలలిత అన్నారు.

తనకు అన్ని ఆయనే
ఎం.జీ. రామచంద్రన్ ప్రజా జీవితంలో తనను ఆత్మీయంగా చూసుకునేవారని, తనకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే అని జయలలిత తెలిపారు.

మనదే విజయం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మనమే విజయం సాధించాలని, అందుకు ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు పాటుపడాలని జయలలిత కోరారు.

ప్రతి కుటుంబానికి అందేలా అమలు చేశాం
పలు అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా అమలు చేశామని, ఈ పథకాలనే అన్నాడీఎంకేకి విజయసోపానాలుగా మలుచుకోవాలని జయలలిత చెప్పారు.

మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని, తన నేతృత్వంలో మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జయలలిత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రూ. 88 కోట్ల పథకాలకు శ్రీకారం
రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన రూ. 88 కోట్ల విలువైన పథకాలు, నిర్మాణాల ప్రారంభోత్సవం చేశారు.

అమ్మా ఫార్మసీలు
తమిళనాడులోని 21 జిల్లాలో సహకార సంఘాల గిడ్డంకులు, ఫలసరుకుల దుకాణాలు, అమ్మా ఫార్మసీలను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జయలలిత ప్రారంభించారు.












Click it and Unblock the Notifications