మోడీకి అన్నాడీఎంకే బానిస, అసదుద్దీన్ హాట్ కామెంట్స్

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేస్తుంటారు. ఏ అంశంపైనా అయినా సరే తన అభిప్రాయాన్ని నికచ్చిగా చెబుతుంటారు. తమిళనాడు ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే పరిస్థితిని వివరించారు. ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బానిసగా మారిపోయిందని చెప్పారు. దురదృష్టవశాత్తు అన్నాడీఎంకే బానిసగా మారిందని అసద్ గుర్తుచేశారు.

అన్నాడీఎంకే ఎంత మాత్రమూ జయలలిత పార్టీ కాదని అసదుద్దీన్ తెలిపారు. జయలలిత తన పార్టీని బీజేపీకి ఎప్పుడూ దూరంగా ఉంచేదని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం మోడీ బానిసగా అన్నాడీఎంకే మారిపోయిందని ఎద్దేవా చేశారు. టీవీవీ దినకరన్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడాన్ని ఒవైసీ సమర్థించుకున్నారు. బాబ్రీ మసీదు విషయంలో శివసేన కొన్ని వ్యాఖ్యలు చేసింది.. ఆ వ్యాఖ్యలతో డీఎంకే ఇప్పుడు ఏకీభవిస్తుందా? అని అడిగారు.

aiadmk has turned into pm modi slave mim chief asaduddin owaisi said

దినకరన్, తాను బీజేపీకి బీ టీమ్ అంటూ విమర్శిస్తున్నారని.. కానీ డీఎంకే మాత్రం శివసేనను అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని గుర్తుచేశారు. తాము ఎన్నికల గోదాలో దిగిన ప్రతిసారీ బీజేపీ లాభపడుతోందని విమర్శిస్తున్నారు. సెక్యులరిజం అంటే ఏమిటో డీఎంకే వివరిస్తుందా? మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేనకు మద్దతిస్తోంది. మరి ఇప్పుడు శివసేన సెక్యులరా? మతతత్వవాదా? డీఎంకే చెప్పాలి అని ఒవైసీ సూటిగా ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+