‘అమ్మ’పార్టీలో.. న్యూ పవర్ సెంటర్! దినకరన్ కు ముఖ్యమంత్రి యోగం?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకేలో శశికళ తనయుడు టీటీవీ దినకరన్ కొత్త అధికార కేంద్రంగా అవతరించనున్నారనే ప్రచారం మొదలైంది. శశికళ జైలుకు వెళుతూ పార్టీలో తన తరువాత అత్యున్నత పదవి కట్టబెట్టడం కూడా ఇందులో భాగమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అంతేకాదు, దినకరన్ త్వరలోనే ముఖ్యమంత్రి కూడా అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి పోటీ చేసేందుకు దినకరన్ సిద్ధమవుతుండడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

శాసనసభ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి దినకరన్ ను ఎమ్మెల్యే చేయాలని 'చిన్నమ్మ' భావిస్తున్నట్లు పోయెస్ గార్డెన్ వర్గాల సమాచారం. తనకు జైలుశిక్ష పడడంతో పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయిన శశికళ అటు పార్టీ, ఇటు ప్రభుత్వంపై తన పట్టు సడలిపోకుండా చూసుకునేందుకు దినకరన్ ను తెర మీదికి తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

AIADMK leadership: Sasikala nephew Dinakaran is new power centre

దినకరన్ తన 'దూత'గా వ్యవహరిస్తాడని శశికళ స్వయంగా ప్రకటించినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పళనిస్వామి పదవికి భవిష్యత్తులో దినకరన్ ఎసరు పెట్టడం ఖాయం అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు శశికళ వర్గానికి చెక్ పెట్టకపోతే.. పళనిస్వామి తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమనే వాదన కూడా వినిపిస్తోంది. మరి, శశికళ వ్యూహం, ఆశీర్వాదంతో 'అమ్మ' పార్టీలో దినకరన్ న్యూ పవర్ సెంటర్ గా ఎదుగుతారా.. లేదా.. అన్నది కొద్ది కాలంలోనే తేలిపోతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK chief V K Sasikala left for Bengaluru on Wednesday to begin her four-year long incarceration, the final order that came from the Poes Garden residence was an announcement revoking the suspension of her nephews TTV Dinakaran and S Venkatesh, known as Dr Venkatesh in the party. What made the statement more significant was that Dinakaran was given the key post that of the deputy general secretary of the party, the number 2 position in the party after Sasikala.
Please Wait while comments are loading...