సీఎం పళనిసామి అత్యవసర సమావేశం, శశికళను శాశ్వతంగా సాగనంపాలని రహస్య చర్చ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రహస్యంగా చర్చిస్తున్నారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రహస్యంగా చర్చిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులను సమావేశానికి దూరం పెట్టి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాత్రమే చర్చలు జరుపుతున్నారు.

చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం సీఎం పళనిసామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రోజురోజుకు దినకరన్ దూకుడు పెంచుతున్న సమయంలో సీఎం పళనిసామి వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారు.

AIADMK MLAs,MPs and functionaries meeting at AIADMK head office

పార్టీ కార్యవర్గం, సర్వసభ్య సమావేశం ఎప్పుడు నిర్వహించాలి ? అనే విషయంపై చర్చజరుగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని చర్చిస్తున్నారని తెలిసింది. శశికళను, టీటీవీ దినకరన్ ను శాశ్వతంగా పార్టీ నుంచి సాగనంపడానికి సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం పావులుకదుపుతున్నారు.

మరో వైపు తానేమి తక్కువ తిన్నానా అంటూ టీటీవీ దినకరన్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గంలోని 255 మంది, సర్వసభ్యుల్లోని 2,750 మంది సభ్యుల మద్దతుకూడగట్టుకునే పనిలో దినకరన్ బిజిబిజీగా గడుపుతున్నారు. పళనిసామి నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో తమిళనాడు మంత్రులు హాజరైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+