ఆపోలో ఆసుపత్రిలో కాబోయే సీఎం శశికళ భర్త, తీవ్ర అనారోగ్యం
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి శశికళ భర్త నటరాజన్ అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నటరాజన్ కు శ్వాసకోస సమస్యలు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి శశికళ భర్త నటరాజన్ అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నటరాజన్ కు శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయన ఇబ్బంది పడుతున్నారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి.
నటరాజన్ కు ఊపిరి అందడం లేదని చెప్పడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయంపై పార్టీ వర్గాలు ఏమీ వెల్లడించలేదు. దీంతో నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. ఈ విషయంపై అన్నాడీఎంకే నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు శశికళ సిద్దం అవుతున్న సమయంలోనే ఆమె భర్త నటరాజన్ కు ఉన్నట్టుండి అనారోగ్యంతో ఆసుపత్రి పాలుకావడంతో మన్నార్ గుడి గ్యాంగ్ ఆందోళనకు గురైయ్యింది. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన శశికళ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు.
అయితే శశికళ సీఎం కావడం ఇష్టం లేని వారు ఆమె మీద విమర్శలు చేస్తున్న సమయంలో సానుభూతి కోసం నటరాజన్ ఆసుపత్రిలో చేరారని ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications