జయ చేసిన చోటే.. సీఎంగా రేపు శశికళ ప్రమాణ స్వీకారం, డిప్యూటీగా పన్నీరు..
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ రేపు (మంగళవారం) తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ రేపు (మంగళవారం) తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మద్రాస్ యూనివర్సిటీ హాలులో ఉదయం తొమ్మిది గంటలకు లేదా పదకొండు గంటలకు ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నరు. 2011, 2016 సంవత్సరాలలో దివంగత జయలలిత అక్కడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ మేరకు శశికళ ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ కనిపించింది. శశికళ రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందులో ఉంది. ఆ తర్వాత జల్లికట్టు అంశానికి సంబంధించిన ట్వీట్లు ఉన్నాయి.

శశికళతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా తప్పుకున్న పన్నీరు సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. ఆయనకు ఎలా ప్రాధాన్యత ఇస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఆదివారం ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆమె పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదించారు. రేపు ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications