అసభ్య, అశ్లీల పదజాలం: దీపికా పడుకొనేకు కోర్టు ఊరట
ముంబై: వివాదాస్పద ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో అసభ్య, అశ్లీలకరమైన పదజాలం ఉపయోగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో బాలీవుడ్ బామదీపికా పదుకొనేతోపాటు మరికొందరు ప్రముఖులకు ఊరట లభించింది. ఈ కేసులో దీపికపై కఠిన చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయవద్దని పోలీసులకు జస్టిస్ రంజిత్ మోరే, అనుజా ప్రదుదేశాయ్‌లతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని దీపికా పదుకొనే ఈ నెల రెండో తేదీన బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ నేపథ్యంలో మార్చి 16 వరకు అంటే పిటిషన్‌పై విచారణ చేపట్టే రోజు వరకు ఆమెను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. నిరుడు చివర్లో ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంలో దీపికతోపాటు బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అర్జున్‌కపూర్, రణవీర్‌సింగ్, ఇతరులపై కేసు నమోదుచేశారు. దీపికా పడుకొనేకు లభించిన ఊరటనే ఇంతకు ముదు అర్జన్ కపూర్, రణవీర్ కపూర్‌లకు లభించింది.
సంతోష్ దౌంద్కర్ అనే సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఆ ఎఎఫ్ఐర్ నమోదు చేశారు. కోర్టు ముంబై, పూణేలకు సంబంధించిన రెండు కేసులను కలిపి విచారణకు చేపట్టింది. టార్డియో పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications