ఎయిమ్స్ వైద్యుల ఘనత: ప్రపంచంలోనే పెద్ద కణితి తొలగింపు
న్యూఢిల్లీ: వైద్య చరిత్రలో ఇప్పటి వరకు నిర్వహించని ఓ అరుదైన సర్జరీని భారతీయ వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. మూత్ర పిండాల క్యాన్సర్‌తోపాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఓ రోగి నుంచి 5.018 కేజీల బరువున్న కణితిని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు ఐదున్నర గంటలపాటు శ్రమించి తొలగించారు.
ఈ సందర్భంగా క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఎండి రే మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇంత పెద్ద పరిమాణంలోని మూత్రపిండ కణితిని తొలగించడం ఇదే తొలిసారని చెప్పారు.
ఢిల్లీకి చెందిన కెఎల్ దాస్(66) అనే వ్యక్తి మూత్రపిండ క్యాన్సర్‌తో బాధపడుతూ తమను సంప్రదించారని, ఆయన కుడి మూత్రపిండం సాధారణ పరిమాణంతో పోలిస్తే 35 రేట్లు వాచి ఉందని పేర్కొన్నారు.

క్రమంగా ఊపిరితిత్తులకూ వ్యాధి వ్యాప్తి చెందినట్లు వివరించారు. మే 14న 5న్నరగంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించి కణితిని తొలగించామన్నారు. ప్రస్తుతం దాస్ కోలుకున్నారని, గురువారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
గతంలో సర్ గంగారం ఆస్పత్రి వైద్యులు 2.5 కిలోల మూత్ర పిండ కణితిని తొలగించారని ఆయన చెప్పారు. దానిని ఇప్పుడు తాము బ్రేక్ చేశామని ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ ఎండి రే తెలిపారు.












Click it and Unblock the Notifications