AIMIM ఈ రాష్ట్రాలకే పరిమితమా,అక్కడ ఎందుకు పోటీకి దూరం..!!
AIMIM.. హైదరాబాద్ కేంద్రంగా దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తున్న పార్టీ. హైదరాబాద్ లో పుట్టి.. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న పార్టీ. తెలంగాణకే ఎంఐఎం పరిమితం కాలేదు. మహారాష్ట్ర.. బీహార్.. ఉత్తర ప్రదేశ్ లోనూ ప్రాబల్యం చాటుకుంది. రాజకీయంగా సక్సెస్ లు.. ఫెయిల్యూర్ లు ఉన్నా... పోటీకి మాత్రం ఆ రాష్ట్రాల్లో వెనక్కు తగ్గటం లేదు. అయితే.. దక్షిణాది రాష్ట్రాల విషయం లో మాత్రం ఆచి తూచి నిర్ణయం తీసుకుంటోంది. తమిళనాడు, కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకే పరిమితం అవుతోంది. కేరళ లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నా పోటీ చేయటం లేదు. దీని వెనుక బలమైన కారణం ఉంది. అసలు.. ఎంఐఎం లక్ష్యం ఏంటి...
ఆరు దశాబ్దాలకు పైగా ఎంఐఎం రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటు పోట్లు ఉన్నాయి. పార్టీ ఆరంభం నుంచి హైదరాబాద్ లో తిరుగులేని శక్తిగా ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ ఇప్పటికీ ఎంఐఎం కంచుకోటగానే ఉంది. బీజేపీ సహా పలు పార్టీలు ఎంతో మందిని బరిలోకి దింపి.. ఎంఐఎం ను ఓడించాలని ప్రయత్నించినా సాధ్య పడలేదు. తండ్రి సలావుద్దీన్ ఓవైసీ నుంచి అసద్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత ఎంఐఎం వేగంగా విస్తరించింది. హైదరాబాద్ ఎంపీ సీటు తో పాటుగా అసెంబ్లీలో ఏ పరిస్థితుల్లోనూ ఏ ఎన్నికల్లోనూ ఏడు స్థానాలు తగ్గకుండా సత్తా చాటుతోంది.

అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 45 నుంచి 50 డివిజన్ల వరకూ ప్రతీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తోంది. కాంగ్రెస్ కు అనుకూలంగా.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి మద్దతుగా.. ఇప్పుడు తిరిగి రేవంత్ కు అవసరమైన సందర్భాల్లో అండగా నిలుస్తోంది. కాగా,ఎంఐఎం రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుంది. కాగా..మహారాష్ట్రలోని ఔరంగాబాద్ గెలిచి తమ ఖాతాలో హైదరాబాద్ తరువాత రెండో స్థానం వేసుకుంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంఐఎం హవా
మహారాష్ట్ర అసెంబ్లీలో 2019 లో రెండు స్థానాలు, 2024 లో ఒక స్థానం దక్కిచుకుంది. ఇక, ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గణనీయంగా ఓటర్ల మద్దతు సాధించింది. బీహార్ లోనూ పలు ప్రాంతాల్లో ఎంఐఎం ప్రభావం ఉంది. బీహార్ అసెంబ్లీలో అయిదు స్థానాలను హోరా హోరీ పోరులోనూ దక్కించుకుంది. ఉత్తర ప్రదేశ్ లోనూ ఎంఐఎం బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. ఇక, గుజరాత్ లో ఎంఐఎం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది.
ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డివిజన్లను సొంతం చేసుకుంది. అదే విధంగా కర్ణాటకలో హుబ్లీ, బెలగావి, బీదర్ వంటి చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపింది. తమిళనాడులో వనియంబాడి లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 16 వార్డుల్లో విజయం సాధించింది. అయితే, కేరళలో మాత్రం ఎంఐఎం అడుగు పెట్టటం లేదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంఐఎం పాత్ర పైన చర్చ మొదలైంది.

ముస్లిం లీగ్ ప్రభావంతో..
ఎంఐఎం బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తుందనే విమర్శ ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వం తో విభేదిస్తున్న అసద్.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పని చేస్తున్నారు. ఏపీలోనూ పోటీ చేసినా.. అక్కడ ఆదరణ లభించ లేదు. అయితే, కేరళలో ముస్లిం లీగ్ కారణంగా అక్కడ ఎంఐఎం అడుగు పెట్టటం లేదనే అభిప్రాయం ఉంది. కేరళలో దశాబ్దాల చరిత్ర ఉన్న ముస్లిం లీగ్ అక్కడి ప్రభుత్వాల ఏర్పాటు.. మద్దతు.. ఇతర రాష్ట్రాల్లో అందించే సహకారంలో కీలక పాత్ర పోషించింది.
1976 నుంచి కాంగ్రెస్ తో మిత్రపక్షంగా కొనసాగుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న సమయంలో ముస్లిం లీగ్ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించారు. ప్రస్తుత లోక్ సభలో ముస్లిం లీగ్ (IUML) నుంచి ముగ్గురు ఎంపీలు లోక్ సభకు ఎంపిక అయ్యారు. ఇద్దరు రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ లో ఎంఐఎం - ముస్లిం లీగ్ సభ్యులు అనేక అంశాల్లో దాదాపు ఒకే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎంఐఎం తరహాలోనే ముస్లిం లీగ్ సైతం సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ కావటంతో.. అక్కడ ఎంఐఎం ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications