కుప్పకూలిన తేలికపాటి విమానం- ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు
జార్ఖండ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. ఛత్రా జిల్లా సిమారియా సమీపంలో ఈ ఘటన సంభవించింది. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన తేలికపాటి విమానం అది. ఓ రోగిని మెరుగైన వైద్య చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. రాంచీ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం 7:11 నిమిషాలకు టేకాఫ్ అయింది. ఆ కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.
ఎయిర్ అంబులెన్స్‌లో ఉన్న ఏడుగురూ ఈ ప్రమాదంలో మరణించినట్లు ఛత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ తెలిపారు. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఎయిర్ అంబులెన్స్ రాడార్ నుంచి అదృశ్యమైంది. సిమారియాలోని బరియాతు పంచాయతీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు వెలికితీసినట్లు ఎస్‌డీపీవో శుభం ఖండేల్‌వాల్పేర్కొన్నారు. మృతులను కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్‌గా గుర్తించారు.

ఢిల్లీకి చెందిన నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ రెడ్‌బర్డ్ ఫ్లీట్. ఈ సంస్థకు మొత్తం ఆరు ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ఇప్పుడు కుప్పకూలింది అందులో ఒకటి. రాంచీలోని దేవకమల్ హాస్పిటల్ సీఈఓ అనంత్ సిన్హా తమ ఆసుపత్రిలోని ఓ రోగి కోసం ఈ ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. లాతేహార్ జిల్లా చాంద్వాకు చెందిన 41 ఏళ్ల సంజయ్ కుమార్ ఫిబ్రవరి 16న 65 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను ఢిల్లీకి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
దీనికోసం రాంచీ-ఢిల్లీ సెక్టార్‌లో మెడికల్ ఎవాక్యుయేషన్ (ఎయిర్ అంబులెన్స్) విమానాన్ని నడుపుతున్న రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ను సంప్రదించారు. బీచ్‌క్రాఫ్ట్ సీ90 రకానికి చెందిన తేలికపాటి విమానం వీటీ ఏజేవీని వినియోగించారు. ఈ విమానం రాంచీ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.
#WATCH | An air ambulance, with seven people (including 2 crew members) on board, crashed in Kasariya Panchayat, Simariya block of Chatra district, in Jharkhand.
— ANI (@ANI) February 24, 2026
It was a Redbird Airways Pvt Ltd Beechcraft C90 aircraft VT-AJV operating a medical evacuation (air ambulance)… pic.twitter.com/xmr9OOcdNh
టేకాఫ్ అయిన 20 నిమిషాలకు విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని రాంచీ విమానాశ్రయం డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతికూల వాతావరణం ప్రమాదానికి ఓ కారణం కావచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు కారణం ఏమిటనే విషయంపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications