వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

|
Google Oneindia TeluguNews

ఒడిశా: ఒడిశాలో బుధవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లాలోని కుదర్ షాహి గ్రామం సమీపంలో బుధవారం మద్యాహ్నం 1.20 నుండి 1.30 మద్య కాలంలో జెట్ విమానం కూలిపోయింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్ లకు గాయాలైనాయని, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఒడిశా పోలీస్ చీఫ్ (డీఐజీ) సంజీవ్ మారిక్ చెప్పారు. సంజీవ్ మారిక్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బుధవారం ఒడిశాలోని కలైకుండ ఎయిర్ బేస్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ద విమానం బయలుదేరింది. జెట్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్న ఈ విమానం ఎయిర్ బేస్ కు 50 కిలో మీటర్ల దూరంలో వెలుతున్న సమయంలో ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.

Air Force Jet Crashes in Odisha, Two Pilots injured

విషయం తెలుసుకున్న ఎయిర్ ఫోర్స్ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన ఇద్దరు పైలెట్లను ఆసుపత్రికి తరలించారు. గాయాలైన పైలెట్లలో ఒకరి పేరు సచిన్ అని తెలిసిందని పోలీసు అధికారులు తెలిపారు.

మయూర్ బంజ్ జిల్లా కలెక్టర్ సూరత్ ముల్లిక్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఇద్దరు పైలెట్లను గుర్తించామని అన్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని విచారణ చేస్తున్నామని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

English summary
The advanced jet trainer aircraft crashed after flying for about 50 km from the Kalaikunda Air Base on a routine sortie, Air Force officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X