వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి... రూ. 18,000 కోట్లతో బిడ్ గెల్చుకున్న టాటా సన్స్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రతన్ టాటా

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 68 ఏళ్ల తరువాత మళ్లీ టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. టాటా సన్స్ వేసిన బిడ్‌ను ఆమోదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఒకప్పుడు టాటా సంస్థ స్థాపించిన ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అర్థ శతాబ్దం దాటింది. ఆ తరువాత ఇప్పుడు అదే టాటా సంస్థ మళ్లీ ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి తన సొంతం చేసుకుంది.

https://twitter.com/ANI/status/1446425302016479234

ఈ విక్రయానికి సంబంధించిన విధి విధానాలన్నీ 2021 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని 'ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్' కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

భారత జాతీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా కోసం టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ సొంత సంస్థ అయిన టాటా సన్స్ బిడ్ వేసింది. ఈ కొనుగోలు కోసం టాటా సన్స్ మరో పౌర విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రమోటర్ అయిన అజయ్ సింగ్ నేతృత్వంలోని కన్సార్టియంతో పోటీ పడింది. అజయ్ సింగ్ బృందం దీని కోసం రూ. 15,100 కోట్లకు బిడ్ వేసింది.

ఎయిర్ ఇండియాకు ఆగస్ట్ 31 నాటి రూ. 61,562 కోట్ల రుణభారంతో ఉంది.

ఎయిర్ ఇండియా విమానం వద్ద అభివాదం చేస్తున్న ఎయిర్ హోస్టెస్

వెల్‌కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా - రతన్ టాటా

ఎయిర్ ఇండియా బిడ్‌ను టాటా సన్స్ గెల్చుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన తరువాత, 'వెల్‌కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా' అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు.

ఎయిర్ ఇండియాను టాటా సంస్థ గెల్చుకోవడం నిజంగా గొప్ప వార్త అని చెప్పిన రతన్ టాటా, ఈ సంస్థను పునర్నిర్మించడానికి చాలా శ్రమించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

https://twitter.com/RNTata2000/status/1446431109122650118

టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ హోదాలో ఉన్న రతన్ టాటా, జెఆర్‌డీ టాటా నాయకత్వంలో నడిచిన ఎయిర్ ఇండియా ఒకప్పుడు ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక విమానయాన సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఆ వైభవం తిరిగి వస్తుందని ఆశిస్తున్నామని కూడా రతన్ తెలిపారు. ఈ సమయంలో జేఆర్‌డీ టాటా కనుక ఉంటే ఎంతో సంతోషపడి ఉండేవారని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Air India again goes to Tata sons in bidding
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X