భారత్ నుండి విమానాలు బంద్.. వెళ్లినవీ వెనక్కి
ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని మూసివేశాయి. దీని ప్రభావం భారత పౌర విమానయానంపై తీవ్రం పడింది. గందరగోళానికి దారి తీసింది. ఎయిరిండియా సహా మరికొన్ని పౌర విమానయాన సంస్థలు ఇరాన్, ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను రద్దు చేశాయి. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ఇది కొనసాగుతుందని ఎయిరిండియా తెలిపింది.
ఈ ఉదయం ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఏఐ139 విమానం ఇంటిదారి పట్టింది. తన గగనతలాన్ని ఇజ్రాయెల్ మూసివేసిన నేపథ్యంలో ఇది వెనక్కి వస్తోందని ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అలాగే టెల్ అవీవ్ నుండి ఢిల్లీకి తిరిగి వచ్చే ఏఐ140 కూడా తాజా నిర్ణయంతో ప్రభావితమైంది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు గగనతలాన్న తాత్కాలికంగా మూసివేసినట్లు టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR) నుంచి తమకు సమాచారం అందిందని ఎయిర్ ఇండియా తెలిపింది.

ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా దీన్ని మరెక్కడికీ మళ్లించట్లేదని, నేరుగా భారత్‌కు తిరిగి వస్తోందని వివరించింది. ఊహించని ఈ పరిస్థితి కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, అత్యున్నత భద్రతా ప్రమాణాలను కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. విమాన కార్యకలాపాలకు సంబంధించిన భద్రతా వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటామని, అవసరమైన విధంగా ముందుగానే కార్యకలాపాలను సర్దుబాటు చేస్తామని పేర్కొంది.
ఈ పరిణామాలతో పశ్చిమ దేశాల నుండి భారత్‌కు వెళ్లే విమానాల ప్రయాణ సమయం పెరుగుతోంది. అమెరికా మార్గాలకు ఇంధనం నింపే విరామ స్థావరాలు తప్పనిసరి కావచ్చు. చికాగో నుంచి ఢిల్లీ చేరుకోవాల్సిన విమానం ఇబ్బందులకు గురైంది. ఇరాక్ గగనతలానికి బదులుగా సిరియా మీదుగా మళ్ళింది. ఇది అత్యంత సుదీర్ఘ మార్గం. గగనతలాలు మూసివేయడం వల్ల సుదీర్ఘ సమయం పాటు ఈ విమానం ప్రయాణించాల్సి వచ్చింది. టెల్ అవీవ్‌లోని సిబ్బందిని ఎయిరిండియా తరలిస్తోంది.
ఈ దాడుల నేపథ్యంలో రాత్రిపూట యూరప్ వైపు వెళ్లే విమానాలకు ఇరాక్ మీదుగా ప్రయాణాన్ని నిలిపివేసింది. పగటిపూట అమెరికా విమానాలకు కూడా ఇది వర్తిస్తుంది. అమెరికా విమానాలకు ఇకపై వియన్నా లేదా రోమ్‌లో ఇంధనం కోసం ఆగాల్సిన అవసరం రావచ్చు. ఇండిగో సైతం తమ విమానాలపై ఈ ప్రభావాన్ని అంచనా వేస్తోంది. పాకిస్తాన్ నుండి ఇరాక్ వరకున్న పశ్చిమ గగనతలం భారతీయ విమానయాన సంస్థలకు నిషిద్ధం. ఇది యూరప్, యూకే, అమెరికా విమానాలను ప్రభావితం చేస్తుంది.
-
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
దేశంలో పెట్రోల్, గ్యాస్ స్టాక్.. రెండు నెలలే -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం తీవ్రం- కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం!












Click it and Unblock the Notifications