ఎయిర్ ఇండియా: ప్రయాణికుడి భోజనంలో బల్లి
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలో బల్లి పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దెబ్బతో ఎయిర్ ఇండియా మీద ఇంకోక సారి ఆరోపణలు రావడంతో అధికారులు సతమతం అయ్యారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా విమానం ఎఐ 111 లండన్ బయలుదేరింది. తరువాత అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి సిబ్బంది భోజనం ఇచ్చారు.

ఆహారం ఇచ్చిన ట్రేలో బల్లి కనిపించింది. షాక్ కు గురైన ఆ వ్యక్తి ఎయిర్ ఇండియా సిబ్బందిని పిలిచి బల్లి పడిందని ప్లేట్ వేరే ఇవ్వాలని చెప్పాడు. అయితే సిబ్బంది మాత్రం వేరే ప్లేట్ ఇవ్వడానికి నిరాకరించారని, తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రయాణికుడు ఆరోపించారు.
ఈ విషయంపై తాను ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని ప్రయాణికుడు అన్నారు. అయితే ఎయిర్ ఇండియా వాదన మరో విధంగా ఉంది. ప్రయాణికుడికి ఇచ్చిన భోజనం లో బల్లి లేదని, ఆ అవకాశం లేదని అంటున్నారు. తమకు ఎవ్వరు కూడా ఫిర్యాదు చెయ్యలేదని ఎయిర్ ఇండియా అధికారులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications