షాకిచ్చిన పాకిస్థాన్.. భారత్ కు రూ. 5 వేల కోట్ల నష్టం.. నెక్స్ట్ ప్లాన్ ఇదేనా ?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలని భారత ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపింది.

సింధూ జలాల రద్దుతోపాటు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అలాగే పాకిస్థాన్ కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కు ప్రతిపాదనలు కూడా పంపింది. దీంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే తామేమీ తక్కువ కాదని పాకిస్థాన్ సైతం భారత్ పై పలు ఆంక్షలు విధించింది. అలా పాకిస్థాన్ గగనతలంను మూసివేసింది. దీంతో భారత్ లోని వైమానిక సంస్థ ఎయిర్ ఇండియాకు సుమారు రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తన్నారు. ఏడాది పాటు పాకిస్థాన్ గగనతలం ఇలానే మూసివేస్తే.. భారత్ కు రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ నిర్ణయంతో ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం ఎయిర్ ఇండియాతో పాటు ఇతర భారతీయ విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించేవాళ్లు ఇకపై పాకిస్థాన్ గగనతలం నుంచి ప్రయాణించేందుకు వీలు లేదు. ఈ నిర్ణయం ఎప్పటివరకు అమల్లో ఉంటుందో తెలియదు. మరోవైపు భారత్ కూడా పాకిస్థాన్.. విమానాల కోసం తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.

మరోవైపు పహల్గాం ఉగ్రదాడి NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా లభించిన రెండు కీలక వీడియోల ఆధారంగా ఉగ్రదాడిని ఎన్‌ఐఏ విశ్లేషిస్తోంది. జిప్‌ లైన్‌ ఆపరేర్లను విచారణ చేస్తున్న ఎన్‌ఐఏ.. బైరసన్‌ లోయలో ఉగ్రవాదులు వాడిన 40 క్యాట్రిడ్జ్‌లను గుర్తించింది. ఈ మేరకు విచారణను ముమ్మరం చేసింది.

Air India Faces 5 000 Crore Annual Loss Amid Pakistan Airspace Closure

అయితే.. పహల్గాం ఉగ్రదాడి జరిగి సుమారు 10 రోజులు కావొస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు.. ఆ దట్టమైన అడవుల్లో మనుగడ ఎలా అనే విషయంపై NIA దృష్టిసారించింది. ఇందులో భాగంగా... వారివద్ద సమృద్ధిగా ఆహార పదార్థాలు ఉండి ఉండొచ్చని.. అందువల్లే ఇన్ని రోజులుగా దట్టమైన అడవుల్లో దాక్కొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి బలగాలు.

ఇక ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+