పేలిన సెల్‌ఫోన్: ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానం 470టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రయాణికుల్లో ఒకరి సెల్‌ఫోన్ పేలింది. దీంతో విమానంలో పొగలు రావడంతో పైలట్ అప్రమత్తయ్యారు.
వెంటనే ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. సాంకేతిక సిబ్బంది తనిఖీ చేసిన అనంతరం విమానం తిరిగి ఢిల్లీకి బయల్దేరినట్లు తెలిపారు.

ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటీవల కాలంలో సాంకేతిక లోపంగా కారణంగా పలు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో ఢిల్లీ-డెహ్రాడూన్ ఇండిగో విమానం సాంకేతిక లోప కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్ అయ్యింది.
అంతకుముందు ముంబై నుంచి బెంగళూరు బయల్దేరిన ఎయిరిండియా విమానం.. గాల్లో ఉండగానే ఓ ఇంజిన్ పనిచేయకపోవడంతో అత్యవసరంగా మళ్లీ ముంబై విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యింది. ఇలాంటి ఘటనలతోపాటు విచిత్ర ఘటనలు ఇటీవల కాలంలో విమానాల్లో చోటు చేసుకుంటున్నాయి. గాల్లో ఉన్న విమానంలో ప్రయాణికులు పోట్లాడుకోవడం, ఎయిర్ హోస్టెస్‌లతో వివాదాలు జరిగాయి. మీ సర్వెంట్ కాదంటూ ప్రయాణికులకు ఎయిర్ హెస్టెస్‌లు సమాధానం ఇవ్వడం లాంటి ఘటనలు ఇటీవల వార్తల్లో నిలిచాయి. తాజాగా, ఓ విమానంలో అధికారిపై ప్రయాణికుడు దాడి చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications