ఎయిరిండియా విమానంలో మంటలు: తృటిలో తప్పిన ప్రమాదం!

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్ అప్రమత్తం అయ్యారు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదని ఎయిరిండియా అధికారులు తెలిపారు. సకాలంలో మంటలను గుర్తించడం వల్ల నష్టాన్ని నియంత్రించగలిగామని అన్నారు.

ఎయిరిండియా బోయింగ్ బీ777-200ఎల్ఆర్ (వీటీ-ఎఎల్ఎఫ్) రకానికి చెందిన విమానం అది. మరి కొన్ని గంటల్లో ఈ విమానంలో న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమానం ఏసీ విభాగంలో ఆక్సిలరీ పవర్ యూనిట్ ను సాంకేతిక సిబ్బంది పరీక్షిస్తుండగా.. స్వల్పంగా మంటలు అంటుకున్నాయి.

Air India flight to San Francisco catches fire at Delhi airport

ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవ్వరూ లేరు. మంటలను గుర్తించిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్ అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఎయిరిండియా అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల ప్రయాణంలో జాప్యం చోటు చేసుకోవచ్చని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+