జూలై 15 వరకు ఎయిర్​ఇండియా విమాన సర్వీసులు రద్దు, కుదింపు - లిస్టులో..!!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తో ఏయిర్ ఇండియా అలర్ట్ అయింది. విమానాల నిర్వహణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా పలు సమస్యలను గుర్తించింది. విమానాలను సాంకే తిక, నిర్వహణ సమస్యలు వెంటాడటం పైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడు ఏయిర్ ఇండియా నిర్వహణ సమస్యల కారణంగా ఏకంగా ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేసింది. అందులో నాలుగు అంతర్జాతీయ.. నాలుగు దేశీయ విమానాలు ఉన్నాయి.

ఏయిర్ ఇండియా తమ సంస్థకు చెందిన విమానాల నిర్వహణ పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ప్రతీ సర్వీసును పూర్తిగా ప్రతీ విభాతంలో క్షుణ్నంగా పరిశీలన నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిర్వహణ సమస్యలు గుర్తించిన ఎనిమిది విమాన సర్వీసులను ఏయిర్ ఇండియా రద్దు చేసింది. ఇంటర్నేషనల్‌ సర్వీసుల్లో దుబాయ్‌-చెన్నై, దిల్లీ-మెల్‌బోర్న్‌, మెల్‌బోర్న్‌-దిల్లీ, దుబాయ్‌- హైదరాబాద్‌ ప్రయాణించాల్సిన విమానాలు ఉన్నాయి. ఇక డొమెస్టిక్‌ సర్వీసుల్లో పుణె-దిల్లీ, అహ్మదాబాద్-దిల్లీ, హైదరాబాద్‌-ముంబయి, చెన్నై-ముంబయి విమానాలు ఉన్నాయి.

air-india-has-cancelled-seven-flights-including-four-international-and-three-domestic-routes

నిర్వహణ సమస్యల కారణంగా జులై రెండో వారం వరకు తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను 15 శాతం తగ్గిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. ఈ క్రమంలోనే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించినట్లు తెలిపింది. జూన్‌ 21 నుంచి జులై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని ఏయిర్ ఇండియా వెల్లడించింది. సర్వీసుల రద్దు కారణంగా ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న ప్రయాణీల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీసుల కోసం రిజర్వ్ చేసుకున్న ప్రయాణీకులకు ప్రయాణికులకు పూర్తి రీఫండ్ , ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు ఏయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఇతర సర్వీసుల నిర్వహణ పైన ఫోకస్ చేసిన ఏయిర్ ఇండియా.. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+