Air India Flight: ఫ్లైట్ క్రాష్ పై ఎయిరిండియా ప్రకటన-రామ్మోహన్ షాక్..!
242 మందితో లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ అంతర్జాతీయ విమానం సిగ్నల్ కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు బయటికి రాకపోయినా ఈ ప్రమాదాన్ని నిర్దారిస్తూ ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇవాళ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఏఐ171 విమానం ప్రమాదానికి గురైనట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే ఎక్స్ లో తమ హ్యాండిల్ తో పాటు ఎయిర్ ఇండియా డాట్ కామ్ వెబ్ సైట్ లోనూ వెల్లడిస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్ కోల్పోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ రాడార్ 24 లో తేలింది. దీంతో టేకాఫ్ కాగానే విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది.

అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 3.38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు , సిబ్బంది ఉన్నారని తెలిపింది. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు , 7 మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారని వెల్లడించింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారని తెలిపింది. మరింత సమాచారం అందించడానికి 1800 5691 444 అనే ప్రత్యేక ప్రయాణీకుల హాట్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఎయిర్ ఇండియా పూర్తి సహకారాన్ని అందిస్తోందని తెలిపింది.
Flight AI171, operating Ahmedabad-London Gatwick, was involved in an incident today, 12 June 2025. At this moment, we are ascertaining the details and will share further updates at the earliest on https://t.co/Fnw0ywg2Zt and on our X handle (https://t.co/Id1XFe9SfL).
— Air India (@airindia) June 12, 2025
-Air India…
మరోవైపు అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. చాలా బాధపడ్డానన్నారు. తాము అత్యంత అప్రమత్తంగా ఉన్నామని, తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. అన్ని విమానయాన, అత్యవసర ప్రతిస్పందన సంస్థలను త్వరితంగా , సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించానన్నారు. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, వైద్య సహాయం సంఘటనా స్థలానికి చేరుకునేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విమానంలో ఉన్న వారందరికీ, వారి కుటుంబాలకు తన ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయన్నారు.
Shocked and devastated to learn about the flight crash in Ahmedabad.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 12, 2025
We are on highest alert. I am personally monitoring the situation and have directed all aviation and emergency response agencies to take swift and coordinated action.
Rescue teams have been mobilised, and all…
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications