వైమానిక దాడులు, 17 మంది ఉగ్రవాదులు అంతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదుల అంతం చూసింది. బస్సులో కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల మీద వైమానికదాడులు జరిపింది. ఈ దాడులలో అనేక మంది ఉగ్రవాదులు అంతం అయ్యారని పాకిస్థాన్ సైనిక వర్గాలు అంటున్నాయి.
తూర్పు వజీరిస్థాన్ లోని గిరిజన ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్లు పాక్ రక్షణ వర్గాలు గుర్తించాయి. శుక్రవారం షవాల్ జిల్లాలోని మూడు ఉగ్రవాద స్థావరాల మీద పాక్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులలో 17 మంది ఉగ్రవాదులు మరణించారు.

17 మంది మరణించగా అనేక మంది ఉగ్రవాదులు గాయపడ్డారని పాక్ రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు చెందిన నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసం చేశారు. షవాల్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలలోని ఉగ్రవాదుల స్థావరాలను గుర్తిస్తున్నారు.
జర్బ్-ఇ-అజ్బ్ ఉగ్రవాద సంస్థను పూర్తిగా తుడిచి పెట్టాలని పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఆ ఉగ్రవాద సంస్థ స్థావరాలను గుర్తిస్తున్నారు. కారాచీలో బస్సు పై ఉగ్రవాదులు దాడులు చేసి అనేక మంది ప్రాణాలు తీసిన నేపద్యంలోనే ఈ వైమానిక దాడులు జరిగాయని తెలిసింది.












Click it and Unblock the Notifications