ఏయిర్ ఏషియా బంపరాఫర్: రూ. 99కే ప్రయాణం!

Subscribe to Oneindia Telugu
Airasia India Offers Base Fare At Rs 99 For Domestic Travel

ముంబై: మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా విమాన ప్రయాణికులకు పరిమితకాలపు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశీయ మార్గాల్లో ఒకవైపు ప్రయాణానికి టికెట్‌ను కేవలం రూ.99(బేస్‌ ఫేర్‌/పన్నులు, సర్‌చార్జీలు, ఫీజులు కాకుండా)కే పొందొచ్చని ఈ సంస్థ తెలిపింది.

 రూ.444కే అంతర్జాతీయ ప్రయాణం

రూ.444కే అంతర్జాతీయ ప్రయాణం

అదే విధంగా ఇండియన్‌ జేవీ ఎయిర్‌లైన్‌ నెట్‌వర్క్‌ ద్వారా నడిచే అంతర్జాతీయ విమానాల్లో రూ.444కే(బేస్‌ఛార్జి) టికెట్‌ అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు వచ్చే ఏడాది 2018 మే నుంచి 2019 జనవరి మధ్యకాలంలో ఆయా గమ్యస్థానాల మధ్యప్రయాణించాల్సి ఉంటుందని ఎయిర్‌ ఏషియా పేర్కొంది.

 రూ.99బేస్ ఛార్జీతో ..

రూ.99బేస్ ఛార్జీతో ..

‘రూ.99కే(బేస్‌ఛార్జీ) దేశీయ, రూ.444(బేస్‌ఛార్జీ)లకే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణాన్ని ఆనందించండి' అని ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ఇంటర్నేషనల్‌ ట్రిప్‌నకు వెళ్లాలనుకునేవారు కోల్‌కతాలోని జోహర్‌ బహ్రు నుంచి ప్రయాణించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపింది. ఈ విభాగంలో ఎయిర్‌ఏషియా బెర్హాద్‌ బేస్‌ ఛార్జిలను తొలగించింది. అయితే విమానానికి సంబంధించిన అన్ని పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

 ఈ మార్గాల్లో..

ఈ మార్గాల్లో..

అంతర్జాతీయ ప్రయాణాల్లో భాగంగా కౌలాలంపూర్‌ వెళ్లాలనుకునేవారు తిరుచ్చిరాపల్లి, కోచి, ఢిల్లీ, భువనేశ్వర్‌, జయపుర, బాలి, ముంబయి, కోల్‌కతాల నుంచి.. బ్యాంకాక్‌ వెళ్లాలనుకునే వారు జయపుర, కోల్‌కతా, కోచి, చెన్నై, బెంగళూరుల నుంచి మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

 ఆదివారం నుంచే..

ఆదివారం నుంచే..

ఆదివారం రాత్రి నుంచి 9.30 గంటల నుంచి నవంబర్‌ 19 వరకు ఎయిర్‌ఏషియా వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లలో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌ఏషియా ఇండియా, టాటా సన్స్‌కు చెందిన సంయుక్త భాగస్వామ్యంలో ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Malaysian Budget carrier AirAsia today announced a discount sale, offering passengers one-way base fare at Rs 99 for a domestic journey across its Indian JV airline network and Rs 444 for international flights under a limited period offer.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి