ఎయిర్ఏషియా బంపర్ ఆఫర్: రూ.1999లకే టిక్కెట్టు, డిస్కౌంట్స్ ఆఫర్లు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. కొత్త రూట్లలో కొత్త ఆఫర్లతో విమానాలను నడపనున్నట్టు ఎయిర్ ఏషియా ప్రకటించింది. 2018 జనవరి నుండి కొత్త రూట్లలో రూ.1999లకే టిక్కెట్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
కష్టమర్లను ఆకట్టుకొనేందుకు గాను ప్రైవేట్ విమానాయాన సంస్థలు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా తమ విమానాల్లో ప్రయాణీకులు ఎక్కువగా ప్రయాణం చేసేలా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
ఎయిర్ ఏషియా ఇదే తరహ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త సంవత్సరం నుండి కొత్త ఆఫర్లతో ముందుకు రానున్నట్టు ఏయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఆఫర్లను ఉపయోగించుకోవడానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోనే వెసులుబాటును కూడ కల్పించింది.

ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్లు
ఎయిర్ ఏషియా 2018 జనవరి నుండి కొత్త రూట్లలో విమానాలను నడపాలని నిర్ణయించింది. కొత్త రూట్లలో ప్రయాణం చేసేందుకు రూ.1,999లకే టిక్కెట్టు ధరలు ప్రారంభం కానున్నాయని ఎయిర్ఏషియా ప్రకటించింది.హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు ప్రతి రోజూ డైరెక్ట్ విమానాలను నడుపుతోంది ఎయిర్‌ఏషియా. ఎయిర్ ఏషియా కొత్త రూట్లలో మాత్రమే ఈ ధరలను వర్తింపచేయనున్నట్టు ప్రకటించింది.

అడ్వాన్స్ బుకింగ్ చేసుకొంటే ఛార్జీల తగ్గింపు
కొత్త రూట్లలో ప్రయాణం చేసేందుకు టిక్కెట్ల కోసం అడ్వాన్స్ బుక్ చేసుకొంటే టిక్కెట్టు ధరలపై తగ్గింపును కూడ ఇవ్వనున్నట్టు ఎయిర్ఏషియా ప్రకటించింది.
కొత్త ఆఫర్ కింద డిసెంబర్ 10 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కేవలం వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది ఎయిర్‌ఏషియా.

సీట్లు పరిమితమే
కొత్త రూట్లలో ప్రయాణం చేసే విమానాల్లో సీట్లు పరిమితంగానే ఉంటాయని ఎయిర్ఏషియా ప్రకటించింది.అన్ని విమానాలకు ఈ డిస్కౌంట్ ధరలు వర్తించవని మాత్రం ఎయిర్‌ఏసియా తెలిపింది.

ఉచిత ఆహరం, 20 కేజీల లగేజీ ఉచితం
ఎయిర్ ఏషియా ఆఫర్ కింద 20 కేజీల బ్యాగేజ్, ఒకపూట ఆహారం ఉండనుంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే, నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి దేశీయ విమానయాన సంస్థలు భారీ ఎత్తున్న డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications