ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు: చిదంబరంకు ఊరట, అప్పటి వరకు అరెస్ట్ లేనట్లే
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి కోర్టులు ఊరట లభించింది. ఈ కేసు విచారణ నిమిత్తం అరెస్టు చేయకుండా ఉండేందుకు చిదంబరం ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైని ముందస్తు బెయిలు ఇచ్చేందుకు అంగీకరించారు.
జూన్ 5లోగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నివేదికను కోరింది. అప్పటి వరకు చిదంబరంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయవద్దని ఈడీ అధికారులను ఆదేశించింది. మరోవైపు జూన్ 5న విచారణకు హాజరు కావాల్సిందిగా చిదంబరానికి ఈడీ ఇప్పటికే సమన్లు పంపించింది.

ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి జులై 10 వరకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం అనుమతి ఇచ్చారని సీబీఐ, ఈడీ వాదిస్తోంది. ఇందుకు గాను ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి భారీ మొత్తంలో ముడుపులు అందాయని సీబీఐ ఆరోపిస్తుంది. కార్తీ చిదంబరంను కూడా ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications