చిదంబరానికి షాక్: బంధువుల ఆవరణలపై ఈడి దాడులు
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం బంధువుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాడులు జరిగాయి. చెన్నైలోనూ కోల్‌కతాలోనూ ఈ దాడులు జరిగాయి. ఎయిర్‌సెల్ - మాక్సిస్ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈ దాడులు జరిగాయి..
శుక్రవారం ఉదయమే ఈ దాడులు ప్రారంభమయ్యాయి. చెన్నైలో నాలుగు చోట్ల, కోల్‌కతాలో రెండు చోట్ల ఈ దాడులు జరిగాయి. చెన్నైలోని తెనయంపేట్‌లో గల ఎస్ కైలాసం అనే వ్యక్తి ఆవరణలో దాడులు జరిగాయి.

కైలాసం చిబందరం కుమారుడు కార్తి చిదంబరం సన్నిహిత బంధువు. చెన్నైలో ఎస్ సాంబమూర్తి, రాంజీ నటరాజన్ ఆవరణలపై కూడా ఈడి అధికారులు దాడులు నిర్వహించారు. మరో రెండు చోట్ల కూడా దాడులు జరిగాయి.
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి)కి పి. చిదంబరం మంజూరు చేసిన అప్రూవల్‌కు సంబంధించి ఈడి దర్యాప్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications