తప్పిన ఘోర విమాన ప్రమాదం.. అత్యవసర ల్యాండింగ్.. ఏం జరిగిందంటే..?
ఇటీవల విమానాల్లో సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపు ఘటనలు అధికం అయ్యాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి దిల్లీకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 1886 లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని జైపూర్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎయిర్ ఇండియా సేఫ్టీ అండ్ స్టాండార్డ్స్ కు అనుగుణంగా ఎమర్జెన్సీ తనిఖీలు నిర్వహించారు.
ఈ విషయాన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ ధ్రువీకరించింది. ఇదే విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. " ఎయిర్ ఇండియా విమానం AI 1886 భోపాల్ నుంచి దిల్లీ వెళ్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 13 న జైపూర్ కు మళ్లించారు. సాంకేతిక సమస్య కారణంగా ఆ విమానాన్ని జైపూర్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎయిర్ ఇండియా భద్రతా ప్రమాణాల ఆధారంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం" అని ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
అయితే ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా సంస్థ క్షమాపణలు తెలిపింది. వీలైనంత త్వరగా ప్రయాణికులను సురక్షితంగా దిల్లీకి చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది. అలాగే జైపూర్ లోని ఎయిర్ ఇండియా గ్రౌండ్ టీమ్ ప్రయాణికులకు తక్షణ సాయం అందిస్తోందని వివరించింది. ఈ ఘటన ద్వారా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను అండగా ఉంటోందని పేర్కొంది.
ఇక విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని విమానయాన సంస్థ వెల్లడించింది. విమానంలో ఏర్పడిన సాంకేతిక సమస్యపై ఎయిర్ ఇండియా సంస్థ దర్యాప్తు నిర్వహిస్తోంది. రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇండిగో విమానం నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఇలాంటి సాంకేతిక సమస్యే తలెత్తింది. దాంతో విమానాన్ని తిరిగి నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ లోనే ల్యాండింగ్ చేశారు.

అలాగే సెప్టెంబర్ 7 న ఎయిర్ ఇండియా విమానం IX 415 కొచ్చిన్ నుంచి అబుదాబికి బయల్దేరిన నేపథ్యంలో ఇంజిన్ 1 లో చమురు స్థాయి తగ్గిపోవడాన్ని గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయింది. దాంతో పైలట్ విమానాన్ని తిరిగి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోనే ల్యాండింగ్ చేశారు.












Click it and Unblock the Notifications
