ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: 10 జీబీ డేటాఉచిత ఆఫర్, జియోకు దెబ్బేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: రిలయన్స్ జియోతో పోటీకి అనుగుణంగా ఎయిర్ టెల్ తన టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేసింది.మై హోం పధకంలో మరో బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది .మై హోం ప్రమోషనల్ ఆఫర్ లో డిటిహెచ్ సేవలకుగాను నెలకు 10 జీబీ డేటాను అందించనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది.

రిలయన్స్ జియో పోటీకి అనుగుణంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ తన టారిఫ్ ప్లాన్లను మార్చులు చేర్పులు చేసింది. భారతి ఎయిర్ టెల్ తన ప్లాన్లను రివ్యూ చేసింది.

రిలయన్స్ జియో మార్కెట్ లో రంగ ప్రవేశంతో ఇతర టెలికం కంపెనీలు కూడ అదే బాటను పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో కస్టమర్లను తనవైపుకు తిప్పుకొంది.

మరోవైపు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి జియో కూడ రానుంది.అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడ బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి రానుంది.

ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ డేటా ఆఫర్

ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ డేటా ఆఫర్

రిలయన్స్ జియోతో పోటీకి అనుగుణంగా ఎయిర్ టెల్ తన టారిఫ్ ప్లాన్లను మార్చుకొంది. మై హోం ప్రమోషన్ ఆఫర్ లో మునుపలి 5 జీబీ డేటా ఆఫర్ ను రెట్టింపు చేసింది. ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తో కలిపిన పోస్ట్ పెయిడ్ డిటిహెచ్ సేవలపై నెలకు 10 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది.ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ తో పాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ డిజిటల్ టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది.మై ఎయిర్ టెల్ యాప్ లో మై హోమ్ ద్వారా ఈ ఆఫర్ లభ్యమౌతోందని కంపెనీ ప్రకటించింది.

పరిమితులు ఎత్తివేత

పరిమితులు ఎత్తివేత

2016 జూలై 1వ, తేది కంటే ముందుగా ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ప్రారంభించిన వినియోగదారులకు మాత్రమే 5 జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ను అందుబాటులో ఉండేది. అయితే కొన్ని పరిమితులు కూడ ఉండేవి.దీంతో జియో పోటీని తట్టుకొనేందుకుగాను ఎయిర్ టెల్ డేటా ఆఫర్ ను రెట్టింపు చేసింది.బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్ డీటీహెచ్ సర్వీసుల కనెక్షన్లకు పరిమితులను కూడ తొలగించింది.

ఈ ఆఫర్ వీరికి దక్కనుంది

ఈ ఆఫర్ వీరికి దక్కనుంది

ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ లేదా ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ సర్వీస్ కలిగిన వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది. మై హోం యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అయితే రిలయన్స్ జియోను దెబ్బతీసేందుకు ఎయిర్ టెల్ తన డేటా ఆఫర్ ను రెట్టింపు చేసింది.

డిటిహెచ్ సేవల్లో రిలయన్స్ ను దెబ్బతీసేందుకే

డిటిహెచ్ సేవల్లో రిలయన్స్ ను దెబ్బతీసేందుకే

టెలికం రంగంలో రిలయన్స్ జియో రంగప్రవేశంతో టెలికం కంపెనీల లాభాలు పడిపోయాయి.మరో వైపు డిటిహెచ్ వైపు కూడ రిలయన్స్ తన దృష్టిని కేంద్రీకరించింది.అయితే అదే సమయంలో ఇప్పటికే డిటిహెచ్ రంగంలో ఉన్న ఎయిర్ టెల్ తన ఉనికిని కాపాడుకొనేందుకు గాను తన టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేసింది. మూడు నెలల ఉచిత ఆఫర్ తో జియో డీటీహెచ్ సేవల్లోకి వచ్చే అవకాశం ఉంది. సెట్ టాప్ బాక్సుల సహాయంతో 1 జీబీపిఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలను పొందే అవకాశం ఉందనే ప్రచారం కూడ ఉంది.అయితే ఈ ప్రచారం నేపథ్యంలో ఎయిర్ టెల్ ముందు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telecom giant Bharti Airtel, which had earlier announced 5 GB of free data for bundling each postpaid or DTH service with its brodband internet connection, has now made the offer even more exciting for users
Please Wait while comments are loading...