ట్రంప్ సుంకాల బెదిరింపులు.. పుతిన్‌తో ధోవల్ భేటీ వెనుక అసలు కారణం ఇదే!

భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ రష్యాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు రష్యా అగ్రశ్రేణి భద్రతా అధికారులతో కీలక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గానూ ఇండియాపై 50 శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అజిత్ ధోవల్ రష్యా పర్యటనకు మరింత ప్రాముఖ్యత లభించింది. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్-రష్యాల లక్ష్యం ఒక కొత్త, మరింత న్యాయబద్ధమైన, స్థిరమైన ప్రపంచ వ్యవస్థను నిర్మించమేనని స్పష్టం చేశారు. ఈ ప్రపంచ వ్యవస్థ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని , ఆధునికి సవాళ్లను, బెదిరింపులను కలిసి ఎదుర్కొనే స్ఫూర్తిని కలిగి ఉండాలని ఆయన అన్నారు.

ఈ పర్యటనలో అజిత్ ధోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో క్లోజ్డ్-డోర్ సమావేశం జరిపారు. ఈ సమావేశంలో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు, అలాగే విదేశాంగ విధాన సలహాదారు యూరి ఉషాకోవ్ కూడా పాల్గొన్నారు. సమావేశానికి ముందు సెర్గీ షోయిగు మాట్లాడుతూ.. రష్యా-భారత్ సంబంధాలు స్నేహపూర్వక బంధాలతో ముడిపడి ఉన్నాయని, మాస్కోకు భారత్‌తో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవని ఆయన తేల్చి చెప్పారు. ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం ఈ ఏడాది చివరిలో అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయడమేనని తెలుస్తోంది. ఇంధన, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా కీలక చర్చలు జరిగాయి.

Ajit Doval Meets Putin Amid Trump s Tariff Threats Strategic India-Russia Ties Strengthen

సెర్గీ షోయిగు మాట్లాడుతూ.. ఇరు దేశాల నాయకులైన వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీ మధ్య క్రమమైన సంభాషణలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలో వారి తదుపరి సమావేశ తేదీలను నిర్ణయించడం చాలా ముఖ్యమని అన్నారు. అజిత్ ధోవల్ కూడా పర్యటన చాలా సానుకూలంగా జరిగిందని, పుతిన్ భారత పర్యటన గురించి తమకు ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిపారు. శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడూ ఇరు దేశాల సంబంధాలకు ఒక కొత్త దిశను ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా తన టారిఫ్ విధానాలతో బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ.. రష్యాతో అన్ని రంగాల్లో సహకారాన్ని కొనసాగించడానికి భారత్ కట్టుబడి ఉందని అజిత్ ధోవల్ పుతిన్‌తో సంభాషణలో స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయన పుతిన్‌కు భారత పర్యటనకు ఆహ్వానం అందించారు. దానిని పుతిన్ ఆమోదించారు. కాగా.. రష్యా కూడా అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్‌తో జరిపిన సమావేశ వివరాలను ధోవల్‌కు తెలియజేయడానికి అంగీకరించింది. విట్కాఫ్ పుతిన్-ట్రంప్ మధ్య జరగబోయే సమావేశానికి ఏర్పాట్లు చేయడానికి మాస్కోలో ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, సుంకాల విధానంలో మార్పులు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత కీలకమైందో మరోసారి రుజువు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+